యాంకర్ సుమ చేసే ఫన్నీ రీల్స్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తల్లీకూతుళ్లుగా రెండు పాత్రలు తనే చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటారు సుమ. అలా తను షేర్ చేసిన ఎన్నో రీల్స్‌కు లక్షల్లో లైక్స్ వచ్చాయి. అదే తోవలో తాజాగా తనే తల్లిగా, తనే కూతురిగా నటిస్తూ ఒక కొత్త రీల్ షేర్ చేశారు. అందులో అమ్మకు కోపం వస్తే కిచెన్‌లో ఎలాంటి విధ్వంసం జరుగుతుంది అనేది చూపించారు. చాలామంది.. తన రీల్‌కు కనెక్ట్ అవుతూ వాళ్ల ఇళ్లలో కూడా అదే పరిస్థితి అని కామెంట్స్ పెడుతున్నారు. తను ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం మాత్రం ఆపరు సుమ. ప్రస్తుతం ఏ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కూడా సుమ కచ్చితంగా ఉండాల్సిందే. అలా దాదాపు 30 ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు సుమ. All Images And Video Credit: Suma Kanakala/Instagram