దీపికా.. నీ రీల్స్ ఆపేయమ్మా, నవ్వలేకపోతున్నాం

‘బ్రహ్మముడి’ సీరియల్‌ నటి దీపికా రంగరాజు గురించి ప్రేక్షకులకు తెలిసిందే.

సాధారణంగా సీరియల్ హీరోయిన్లు చాలా కామ్‌గా ఉంటారు. పెద్దగా మాట్లాడరు.

అయితే, దీపికా రంగరాజు మాత్రం అలా కాదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది.

తెలుగు రాకపోయినా సరే.. తనకు తెలిసిన తెలుగులో కామెడీ పండిస్తూ ఉంటుంది.

ఇక ఆమె పాటలైతే కర్ణకఠోరంగా ఉంటాయి. అయినా, ప్రేక్షకులు భరిస్తున్నారు అనుకోండి.

దీపికా ఏదైనా షోలో ఉందంటే చాలు.. ఆమే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలుస్తుంది.

ఆమె టాలెంట్ షోస్, సీరియల్స్‌కే పరిమితం కాలేదు. సోషల్ మీడియాకూ విస్తరించింది.

ఆమె చేసే రీల్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఆమెపై నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్లూ ఉన్నారు.

తాజా రీల్స్ చూసిన కొందరు నీకో దన్నం రీల్స్ ఆపేయమ్మా అని కామెంట్ చేస్తున్నారు.

నీ రీల్స్ కూడా కామెడీగానే ఉంటున్నాయని అంటున్నారు. అయితే, అవన్నీ దీపికా స్పోర్టివ్‌గా తీసుకుంటుంది అనుకోండి.

నిజం చెప్పాలంటే దీపికా రంగరాజు కామెడీ రీల్స్ చాలానే చేస్తుంది. గిట్టనివాళ్లే అలా నెగటివ్ కామెంట్స్ పెడుతుంటారు.