Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
Itlu Arjuna Teaser Reaction : డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా ఫస్ట్ మూవీ 'ఇట్లు అర్జున'. అనీశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

Aniesh's Itlu Arjuna Movie Teaser Out : మాటలు రాని ఓ యువకుడు... కుందనపు బొమ్మలాంటి అమ్మాయి. మౌనంగానే మనసులో ప్రేమను దాచుకున్న హీరో తన లవర్‌కు ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'ఇట్లు అర్జున'. అనీశ్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
నాగార్జున వాయిస్ ఓవర్‌తో
టాలీవుడ్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా 'ఇట్లు అర్జున' టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆయనే దీనికి వాయిస్ ఓవర్ అందించారు. 'ప్రేమ అది ఎంత దూరమైనా పరిగెత్తిస్తుంది. కానీ ఎంత ఇష్టమో చెప్పనివ్వదు. మాటల్లో కూడా సరిగ్గా చెప్పలేనిదే ప్రేమ. అసలే నువ్వు మూగోడివి. నీ ప్రేమను ఎలా చెబుతావ్ అర్జున్. అయినా మాటలు రావని నిన్ను అండర్ ఎస్టిమేట్ కూడా చేయలేం.' అంటూ నాగ్ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. ఈ మూవీకి మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read : అతనికి 53... ఆమెకు 38... ప్రేయసితో 'భగవంత్ కేసరి' విలన్ ఎంగేజ్‌మెంట్
ఈ మూవీతోనే అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తుండగా... డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ మూవీతో ప్రొడ్యూసర్‌గా మారారు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. తుఫాన్, భీష్మ, ఛలో, రాబిన్ హుడ్ మూవీస్ తీసిన వెంకీ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో న్యూ జర్నీ ప్రారంభించినట్లు చెప్పారు. 'కొత్త కథలను ఎంకరేజ్ చేయడం, న్యూ టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వడం నా లక్ష్యం. సినిమా అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. What Next Entertainments ద్వారా ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తోన్న క్రియేటివ్ వాయిసెస్, చెప్పాల్సిన కథలకు ఓ వేదిక ఇవ్వాలని అనుకుంటున్నా.' అని చెప్పారు. త్వరలోనే 'ఇట్లు అర్జున'కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.





















