భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
మొన్న ప్రధాని మోదీ.. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇద్దరూ కర్ణాకట వెళ్లి అక్కడి ఉడిపి ప్రాంతంలోని శ్రీకృష్ణ మఠంలో కొలువుదీరిన శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఆలయంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. అసలు ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటి? ఆ ఆలయం చరిత్రేంటి? అని తెగ వెతికేస్తున్నారు చాలామంది. అందులోనూ అన్ని ఆలయాల్లో మాదిరిగా ఈ ఆలయంలో విగ్రహం తూర్పు వైపు కాకుండా.. పడమర వైపు తిరిగి ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఈ ఆలయంలో మూలమూర్తిని మిగిలిన ఆలయాల్లో మాదిరిగా నేరుగా ద్వారం నుంచి చూడటం నిషేధం. కేవలం ఆలయం గోడల వద్ద ఉన్న రంథ్రాల నుంచి మాత్రమే చూడాలి. వీటన్నింటి వల్ల ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఇంకా పెరుగుతోంది. ఉడిపి శ్రీకృష్ణాలయ చరిత్ర ఇప్పటిది కాదు. ముఖ్యంగా ఈ ఆలయ మూలమూర్తి విగ్రహం ద్వాపరయుగానికి చెందినదిగా.. అందులోనూ శ్రీకృష్ణుడే స్వయంగా ఈ విగ్రహాన్ని విశ్వకర్మ చేత తన భార్య రుక్మిణి కోసం చేయించినట్లు పురాణగ్రంథాల్లో ఉంది.





















