అన్వేషించండి

Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Karnataka CM Siddaramaiah | పిల్లలపై మొబైల్ వాడకం పెరుగుతున్న ప్రతికూల ప్రభావాలను నిరోధించేందుకే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

Karnataka Budget 2026 | 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం (మార్చి 6న) రాష్ట్ర బడ్జెట్‌ 2026ను ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. మొబైల్ వినియోగంతో పిల్లలపై పెరుగుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

గత నెలలో రాజధాని బెంగళూరులో జరిగిన వైస్ ఛాన్సలర్ల (వీసీల) సమావేశంలో సిద్ధరామయ్య ఈ అంశంపై చర్చించి, వారి అభిప్రాయాలను కోరారు. ఆ చర్చల సందర్భంగా మొబైల్ వ్యసనం (Mobile addiction), ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming), పిల్లల ఎడ్యుకేషన్, శారీరక దృఢత్వంపై సోషల్ మీడియా చూపుతున్న చెడు ప్రభావంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ వినియోగంతో సోషల్ మీడియాకు టీనేజర్లు మరింతగా అడిక్ట్ అవుతున్నారని, వారి మానసిక పరిస్థితిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వారిలో నేర ప్రవృత్తి పెరగడం, పెద్దల మాట వినకపోవడం, చదువుపై సైతం ఫోకస్ చేయకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సిద్దరామయ్య ప్రస్తావించారు.

యువతలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి కొన్ని చర్యలు తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని కర్ణాటక ఐటీ, బీటీ (IT & BT) శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే జనవరి 30న అసెంబ్లీలో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల మాట్లాడుతూ.. పిల్లలు, టీనేజర్లు మొబైల్ విపరీతంగా వాడటం తీవ్రమైన అంశమని అన్నారు. ఫిన్లాండ్ ఇప్పటికే ఇటువంటి చర్యలు తీసుకుందని, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) కూడా ఇదే విధమైన చర్యను పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఇప్పటికే కొన్ని వయస్సుల పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిందని ఖర్గే గుర్తు చేశారు. సోషల్ మీడియా మితిమీరిన వాడకాన్ని నివారించడానికి ఏమి చేయవచ్చనే అంశంపై తాము కూడా సంబంధిత వర్గాలతో (స్టేక్ హోల్డర్స్) చర్చలు ప్రారంభించామని మల్లికార్జున ఖర్గే కొన్ని రోజుల కిందట అన్నారు. 

తక్కువ వయస్సు గల వినియోగదారుల కోసం సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేయడానికి ఆస్ట్రేలియా కఠినమైన చర్యలు తీసుకుంది. ఫ్రాన్స్, స్పెయిన్‌తో సహా ఐరోపాలోని మరికొన్ని దేశాల్లో కూడా పాఠశాలల్లో తరగతుల సమయంలో విద్యార్థుల ఏకాగ్రతను పెంచడానికి, పరధ్యానంగా ఉండటాన్ని నియంత్రించేందుకు స్కూల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగంపై కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vantara : వంతారాలో వన్యప్రాణి, వెటర్నరీ విశ్వవిద్యాలయం - అనంత్ అంబానీ నేతృత్వంలో మొట్టమొదటి ఫ్యూచర్ రెడీ ఇనిస్టిట్యూషన్
వంతారాలో వన్యప్రాణి, వెటర్నరీ విశ్వవిద్యాలయం - అనంత్ అంబానీ నేతృత్వంలో మొట్టమొదటి ఫ్యూచర్ రెడీ ఇనిస్టిట్యూషన్
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Viral Girl Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు - ఇంత ఈజీగా దొరికిపోయాడా?
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు - ఇంత ఈజీగా దొరికిపోయాడా?
Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిన స్టింగ్ ఆపరేషన్ వీడియో - మమతా బెనర్జీ సిక్సర్ కొట్టారా?
బెంగాల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిన స్టింగ్ ఆపరేషన్ వీడియో - మమతా బెనర్జీ సిక్సర్ కొట్టారా?
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS RR Result Update: వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
Islamabad Talks:
"డీల్ కుదరకపోతే దాడులే" ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక! ఇస్లామాబాద్‌ చర్చలపై ఉత్కంఠ!
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Chiranjeevi : తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget