PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రాష్ట్రాల గగనతనంలో వాయుసేన తన సత్తా చాటింది. నేరుగా ప్రధాని మోదీనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో మోరన్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యి అందరినీ అబ్బురపరిచారు. ఆ తర్వాత గగనతంలో 40నిమిషాల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో వారెవ్వా అనిపించేలా జరిగింది. భారత వాయుసేన అధిపతి వివరిస్తుండగా ప్రధాని మోదీ మన ఎయిర్ ఫోర్స్ సైనిక వీరుల విన్యాసాలను తిలకించారు. త్రిశూల వ్యూహంతో సుఖోయ్ విమానాలు గాల్లో విన్యాసాలు చేయగా...రఫేల్ యుద్ధ విమానం అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ను అలా తాకి తిరిగి మళ్లీ అలా గాల్లోకి లేచి ఆశ్చర్యపోయే రీతిలో విన్యాసాలు చేసింది. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులపై పంజా విసురుతున్న చైనా ఆట కట్టించేలా దిబ్రూఘర్ - మోరన్ జాతీయ రహదారిపై ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిర్మించగా...ప్రధాని మోదీ స్వయంగా ఆ సైనిక కార్యకలాపాల్లో పాల్గొనటం సరిహద్దులు దాటి ప్రవర్తిస్తున్న చైనాకు గట్టి హెచ్చరిక అనే చెప్పుకోవాలి.























