Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టుగా పేరొందిన కుమార దేవం గ్రామంలోని నిద్రగన్నేరు చెట్టు ఏడాది క్రితం పిడుగు పడడంతో రెండుగా విడిపోయింది. దానితో తల్లడిల్లిన గ్రామస్తులు రకరకాల పద్ధతుల్లో మళ్ళీ ఆ చెట్టును బతికించారు.

Movie Shootings At Godavari Tree | గోదావరి గట్టున కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామం లోని నిద్రగన్నేరు చెట్టు ను సినిమా చెట్టు గా పిలుస్తారు అనే సంగతి చాలా మంది సినిమా ప్రేమికులకు తెలుసు. ఈ చెట్టు కింద షూట్ చేసిన సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని ఇండస్ట్రీలోకి నమ్మకం ఉంది. అయితే ఏడాది క్రితం పిడుగులు పడడం తో చెట్టు రెండుగా విడిపోయి పడిపోయింది. దానితో ఒక్కసారిగా ఊరంతా విచారం లో మునిగిపోయింది.
తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిన సినిమా చెట్టు ఇక గతం అంటూ పాత తరం వాళ్ళు బాధపడగా వాళ్ళు బాధ పడగా యువకులు మాత్రం ఆ చెట్టును తిరిగి బ్రతికించే ప్రయత్నం చేశారు. 150 ఏళ్ల ఆ భారీ వృక్షాన్ని పాత ఆయుర్వేద పద్ధతులు ఆధునిక విధానాలు కలిపి మళ్ళీ చిగురించేలా చేశారు. అయితే అవన్నీ తాత్కాలిక ప్రయత్నాలు అంటూ కొంతమంది పెదవి విరిచినా అలాంటి అనుమానాల్ని వొమ్ము చేసింది ఈ చెట్టు. పూర్తిగా చిగురించిన ఆ వృక్షం గోదావరి జిల్లా వాసులనే కాక సినీ ఇండస్ట్రీ జనాలను కూడా ఆనందంలో ముంచింది.
మూగ మనసులు నుండి గేమ్ చేంజర్ వరకూ... 200 సినిమాల షూటింగ్ లు
తెలుగు క్లాసిక్ మూగమనసులు సినిమా హిందీ రీమేక్ మిలన్ (1967) సినిమా షూటింగ్ తొలిసారి ఈ చెట్టు క్రింద జరిగింది. అది సూపర్ హిట్ కావడంతో చాలా హిందీ సినిచాలా హిందీ సినిమా షూటింగ్ లు ఇక్కడ జరిగాయి. ఇక తెలుగు సినిమాల లెక్కైతే చాలానే ఉంది. తెలుగు సినిమా లెజెండ్స్ అందరూ ఏదో ఒక సమయంలో ఈ చెట్టు కింద షూటింగ్ జరిపిన వాళ్లే. సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉండగా పాడిపంటలు సినిమా షూటింగ్ ఇక్కడ జరిపారు. అది పెద్ద హిట్ కావడంతో సెంటిమెంట్ గా భావించి తన సినిమాల్లో చాలా వాటి షూటింగ్ ఈ పరిసరాల్లోనే జరిపేలా ప్లాన్ చేసేవారు ఆయన.
నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా ఎక్కువగానే ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. వాటిలో సీతారామయ్య గారి మనువరాలు క్లాసిక్ గా మిగిలిపోయింది. కృష్ణంరాజు గారి త్రిశూలం, శోభన్ బాబు దేవత, మహేష్ బాబు మురారి, డైరెక్టర్ వంశీ ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్ లాంటి బోలెడు సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుపుకోగా చివరిగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇక్కడ చేశారు. అంతకుముందు అయన సూపర్ హిట్ మూవీ రంగస్థలం కూడా ఈ పరిసరాల్లోనే తీశారు. అటుఇటుగా 200 సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరిగినట్టు ఊరివాళ్లు చెబుతారు.
చెట్టు బరువెక్కడం.. పిడుగుపడడం తో కూలిపోయిన చెట్టు
150 ఏళ్ల ఈ కుమారదేవం చెట్టు పడిపోవడానికి ప్రధాన కారణం దాని వయసే అంటారు కుమారదేవం గ్రామస్తుడు ముసలయ్య. ఆ చెట్టు చాలా శాఖోపశాఖలు గా విస్తరించడంతో అది బాగా బరువెక్కిపోయింది. గత ఏడాది తుఫాను సమయంలో ఆ చెట్టుపై రెండు పిడుగులు పడడం తో అది రెండుగా విడిపోయింది. దానితో ఊరివాళ్ళు మాత్రమే కాకుండా సినీ పెద్దలు సైతం విచారం లో మునిగిపోయారు.

ఈ చెట్టును ఎలాగైనా మళ్ళీ బతికించాలంటూ గ్రామస్తులు, పలు NGO లు, డైరెక్టర్ వంశీ లాంటి సినిమా ప్రముఖులు ముందుకు వచ్చి వివిధ పద్ధతుల్లో చాలా ప్రయత్నాలు చేశారు. వారి కష్టం ఫలించి ఇప్పడు ఆ చెట్టు మళ్ళీ కళకళ లాడుతోంది. అయితే పూర్వ స్థితి కి రావడానికి ఆ సినిమా చెట్టు కు కనీసం మరో పదేళ్లు పడుతుందని గ్రామస్తులు అంటున్నారు. తొందరగా ఆ రోజులు రావాలని మళ్ళీ ఇక్కడ షూటింగ్ లు జరగాలని కుమారదేవం గ్రామస్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.





















