Afghanistan vs Hong Kong Highlights | బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్
ఆసియా కప్ 2025లో ఎవరు ఊహించని విధంగా అప్ఘనిస్తాన్ తన ప్రత్యర్థి టీమ్ హాంకాంగ్ ను అతి గోరంగా ఓడించింది. అప్ఘన్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ బ్యాట్స్మన్ నిలువలేకపోయారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్ఘనిస్తాన్, చాలా తక్కువ పరుగులకే ఓపెనర్ వికెట్ ను సమర్పించుకుంది. మరో ఓపెనర్ సెడికుల్లా అటల్ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి 73 పరుగులు చేసాడు. ఆఖర్లో వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయి తన బ్యాటింగ్ తో ఐదు సిక్సర్లు కొట్టి, 53 పరుగులతో హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మోతంగా అప్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ .... అప్ఘన్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాడు కెప్టెన్ రషీద్ ఖాన్. హాంకాంగ్ టీమ్ కెప్టెన్ యాసిమ్ 16 పరుగులు చేశాడు. టీం మొత్తంలో బాబర్ హయాత్ ఒక్కడే 43 బంతుల్లో 39 పరుగులు చేసాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమైయ్యారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి హాంకాంగ్ 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్ఘనిస్తాన్ 94 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
మొదటి మ్యాచ్ లోనే అప్ఘనిస్తాన్ డామినెటే చేయడం మొదలు పెట్టింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ వరకు వచ్చి.. తన సత్తా ఏంటో చూపించిన అప్ఘనిస్తాన్ ఇప్పుడు ఆసియా కప్ లో ఎన్ని షాకులు ఇస్తదో చూడాలి.





















