అన్వేషించండి
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Bandi Sanjay Kumar Latest News : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని, తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా అని సంజయ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
1/8

కేంద్ర బడ్జెట్‌లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.
2/8

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని వాళ్లే కాంగ్రెస్ నేతలని సంజయ్ మండిపడ్డారు.
3/8

6 గ్యారంటీలపై జనాలను డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని, తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా అని సంజయ్ ప్రశ్నించారు.
4/8

తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు మేం సిద్దమని బండి సంజయ్ ప్రకటించారు. ప్రధాని హోదాకు గౌరవం ఇవ్వకుండా అవాకులు పేలడం సరికాదన్న సంజయ్ ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో 29 వేల 899 కోట్లు కేటాయించామన్నారు.
5/8

గతేడాదితో పోలిస్తే 10 శాతం నిధులు పెంచానామని, గ్రాంట్ల రూపంలో 21 వేల 75 కోట్లు కేటాయించినట్టు చెప్పుకొచ్చారు. రైల్వేల అభివృద్ధికి 5 వేల 336 కోట్లు కేటాయించామని యూపీఏ హయాంతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ ఇస్తున్నట్టు వెల్లడించారు. దేశానికి సంబందించిన బడ్జెట్‌లో ఒక రాష్ట్రం పేరు చెప్పనంత మాత్రాన నిధులివ్వలేదని అనడం సరికాదన్నారు సంజయ్
6/8

క్రిష్ణా జలాలు వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని ఎస్సెల్బీసీ ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది ఆ పార్టీలేనని ఆరోపించారు బండి సంజయ్. ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ అని ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
7/8

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులని, కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసులేమైనయ్ అని ప్రశ్నించారు. ఢిల్లీకి పోయి కాంప్రమైజ్ అయిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. మాపై కేసులు పెట్టొద్దు...కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారని ఆరోపించారు.
8/8

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి.... అందులో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే ఏం న్యాయం చేసినట్లని ప్రశ్నించారు. కుల గుణన తప్పుల తడకగా ఉందని 3.95 కోట్ల ఆధార్ కార్డులుంటే... జనాభా 3.7 కోట్లు ఎట్లా ఉంటారో చెప్పాలన్నారు.
Published at : 20 Feb 2025 08:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion