అన్వేషించండి
Batukamma 2025: చిరుజల్లుల్లోనూ మహిళల ఉత్సాహం.. భాగ్యనగర వీధుల్లో కన్నులపండువగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు!
Batukamma 2025 Celebrations: బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం భాగ్యనగరంలో వీధులన్నీ బతుకమ్మ పాటలతో మారుమోగాయ్...
Bathukamma festival 2025
1/13

సెప్టెంబర్ 21 ఆదివారం పితృఅమావాస్య నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి
2/13

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన తర్వాత ఈ పండుగ మొదలవుతుంది
3/13

ఈ పండుగ ప్రకృతి, మహిళల సంతోషం, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. "బతుకమ్మ" అంటే "బతుకు అమ్మ" అని అర్థం, అంటే జీవితాన్ని ప్రోత్సహించే దేవత అని అర్థం
4/13

మొత్తం 9 రోజుల పాటూ సాగే బతుకమ్మ పండుగలో మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. రంగురంగుల పూలను బతుకమ్మగా పేర్చి మధ్యలో గౌరవమ్మను ఉంచి మహిళలంతా ఆడిపాడతారు
5/13

తంగేడు, గుమ్మడి, గునుగు పూలతో ఎంగిలిపూల బతుకమ్మను తయారు చేస్తారు
6/13

పూలను గోపురంలా పేర్చి తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మను సిద్ధంచేసి..ఇంట్లో దేవుడి మందిరంలో పూజ చేసి నైవేద్యం సమర్పించి అనంతరం ఇంటి లోగిలిలో ఉంచి ఆడిపాడతారు
7/13

భాగ్యనగర వీధులన్నీ బతుకమ్మ సంబురాలతో కళకళలాడుతున్నాయ్..
8/13

బతుకమ్మలన్నింటినీ ఓ చోట చేర్చి ఆటపాటల తర్వాత నిమజ్జనం చేస్తారు
9/13

మొదటి రోజు పూలను నీటిలో నిమజ్జనం చేసి గౌరమ్మను తీసుకొచ్చి ముత్తైదువులకు అందిస్తారు..చివరి రోజు సద్దులబతుకమ్మ రోజు గౌరమ్మను కూడా నిమజ్జనం చేస్తారు
10/13

పితృదేవతలను తలుచుకుంటూ అన్నదానం చేసిన తర్వాత బతుకమ్మ పేర్చుతారు..అందుకే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు
11/13

ముందు ఎవరి ఇంటి ముందు వారు తయారు చేసిన బతుకమ్మతో ఆడిపాడి..ఆ తర్వాత అన్నింటినీ ఓచోట చేర్చి మహిళలంతా కలసి పాటలు పాడతారు
12/13

ఈ రోజు పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పించి..అందరకీ పంచిపెడతారు
13/13

9వ రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి
Published at : 21 Sep 2025 10:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
బిగ్‌బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















