అన్వేషించండి
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Mallu Bhatti Vikramarka - Nagarjuna: అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. నాగార్జున, అమల అక్కినేని నాయకత్వాన్ని ప్రశంసించారు.
అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో తెలంగాణ డిప్యూటీ సీఎం
1/5

కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడు మాత్రమే కాదు... ఆయనలో నిర్మాత, స్టూడియో అధినేత, ఫిల్మ్ కాలేజ్ వ్యవస్థాపకుడు సైతం ఉన్నారు. 'అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియా'లో పలువురు విద్యార్థులు ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కాలేజీకి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెళ్లారు.
2/5

అప్పట్లో అభివృద్ధి పరంగా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో స్థాపించారని, ఆ ప్రాంతం ఇప్పుడు హైదరాబాద్ సిటీలోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక, సినిమా ల్యాండ్ మార్క్‌లలో ఒకటిగా ఎదిగిందని బట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణ కాలేజీలో ప్రపంచ స్థాయి చలనచిత్ర విద్యను అందిస్తున్నారని, అక్కినేని వారసత్వాన్ని నాగార్జున అక్కినేని, అమల అక్కినేని ముందుకు తీసుకు వెళుతున్నారని... వాళ్ళిద్దరి నాయకత్వాన్ని ఆయన కొనియాడారు.
3/5

అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజ్ స్టూడెంట్స్ రూపొందించిన 'రోల్ నంబర్ 52'ను మల్లు భట్టి విక్రమార్క చూశారు. ఆ సినిమా హృదయాన్ని కదిలించే విధంగా ఉందని దర్శకుడితో పాటు చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.
4/5

తెలంగాణ ఆర్థిక వృద్ధిలో చిత్రసీమ కీలక పాత్ర పోషిస్తుందని, తెలంగాణ రాష్ట్ర - చిత్రసీమ భవిష్యత్తును నిర్మించడంలో చిరంజీవి గారు, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ సపోర్ట్ తాము ఆశిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
5/5

తెలంగాణను ప్రపంచంలో మేటిగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అన్నపూర్ణ స్టూడియోస్ కట్టుబడి ఉందని నాగార్జున తెలిపారు.
Published at : 22 Nov 2025 04:33 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















