8th Pay Commission: 8వ పే కమిషన్ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
DA and DR merger in Basic Pay | ఎనిమిదవ వేతన సంఘం అమలు సన్నాహాల సమయంలో. DA/DR ను బేసిక్ శాలరీలో కలిపే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

8th Pay Commission Latest news: 8వ వేతన సంఘం గురించి గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతోంది. అయితే కరువు భత్యం (DA)ను ప్రాథమిక వేతనంలో, అంటే బేసిక్ శాలరీ (Basic Salary)లో కలపాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా, ప్రభుత్వం DA, DRలను పెంచకుండా.. వాటిని బేసిక్ పేలో విలీనం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. అనేక యూనియన్ల ఆశలకు విరుద్ధంగా, ప్రభుత్వం ప్రస్తుత కరువు భత్యం (DA), DR)ల బేసిక్ పేతో విలీనం చేసే ప్రతిపాదనను తిరస్కరించింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది.
ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది?
వాస్తవానికి, ఉద్యోగుల యూనియన్లు DA, DRలను ఏ రేటుతో పెంచుతారో, అది ప్రస్తుత కాలంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు సరిపోదని పేర్కొన్నాయి. కనుక రెండింటినీ బేసిక్ పేలో కలపాలి. దీనివల్ల ప్రాథమిక జీతం పెరుగుతుంది. దీని ప్రకారం HRA, TA వంటి ఇతర అలవెన్సులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం మీద ఉద్యోగుల జీతం పెరుగుతుంది. కొత్త కంపెనీలోనూ బేసిక్ శాలరీ ఎక్కువ ఉంటే ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది..
డిసెంబర్ 1, 2025న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, ప్రస్తుత DAను బేసిక్ శాలరీలో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఎంపీ ఆనంద్ బదౌరియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి ఈ సమాధానం ఇచ్చారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గత 30 సంవత్సరాలలో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారని, అయితే DA, DRలు రియల్ రిటైల్ ద్రవ్యోల్బణానికి సరిపోవడం లేదని పేర్కొన్నారు.
దీపావళికి ముందు డీఏ, డీఆర్ పెంపు..
ఈ సంవత్సరం దీపావళికి ముందు కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR)లో 3 శాతం పెంపు తర్వాత ఉద్యోగులకు DA, పెన్షనర్లకు DR వారి బేసిక్ శాలరీ జీతం లేదా పెన్షన్‌లో 55 శాతం ఉంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) ఆధారంగా ఏడాదికి రెండుసార్లు DA/ DRలో సవరణలు చేస్తారు. మొదటగా జనవరిలో, రెండవసారి జూలైలో ఇది చేస్తారు. ఉద్యోగుల సమాఖ్య పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి DAను బేసిక్ శాలరీలో కలపాలని డిమాండ్ వస్తోంది. అయితే, ఈ డిమాండ్లను కేంద్రం పక్కనపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒకసారి వీటిని విలీనం చేయడానికి బదులుగా, ఎప్పటికప్పుడు సర్దుబాట్లు చేసే ప్రస్తుత శాలరీ స్ట్రక్చర్ విధానానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం మంత్రులు చెబుతున్నారు.






















