అన్వేషించండి

KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్

BRS Working President KTR | కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగిందని.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Delhi Liquor Policy Case | హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంపై BRS పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా లిక్కర్ స్కామ్ పేరుతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేశారని, ఈ కుట్రపూరిత కేసు వల్ల అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసును సృష్టించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ద్వారా కవితకు న్యాయం జరిగిందని, ఇదే రీతిలో తమ పార్టీ నేతలపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే బహిర్గతం అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మీడియాలో కథనాలను తాము ఎదుర్కొన్నామని చెప్పారు. ఏదైనా కేసులో ఆధారాలకు బదులు ఆరోపణలు, న్యాయ ప్రక్రియకు బదులు మీడియా కథనాలే ప్రాధాన్యత సంతరించుకోవడం నేడు దురదృష్టకరమైన కొత్త సంప్రదాయంగా మారిందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ గుర్తుచేశారు. 

తాను కడిగిన ముత్యంలా ఈ కేసులో బయటికొచ్చానని, ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరో లెక్క అని కవిత వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా తనను ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికిస్తే బీఆర్ఎస్ పార్టీ సైతం తనకు అండగా నిలవలేదని, తమ ఓటమికి కారణం తానేనని చెప్పడం అత్యంత బాధాకరం అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయింది తనవల్ల, ఈ కేసు కారణంగా కాదని వారి అహంకారం కారణంగానే ఓడిపోయినట్లు నిజాన్ని ఒప్పుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టి, తన అజెండా ప్రకటిస్తా అన్నారు కవిత.

రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వివరాలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కల్వకుంట్ల కవితతో పాటు మరో 23 మంది నిందితులు తప్పు చేశారని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తు సంస్థ సమర్పించిన ఆధారాలు నేరాన్ని నిరూపించడానికి సరిపోవని పేర్కొంటూ, అందరినీ కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత మూడేళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget