అన్వేషించండి

BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!

KTR And Kaviha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు విషయంలో కేటీఆర్ ట్వీట్.. కవితను ఆగ్రహానికి గురి చేసింది. డియర్ బ్రదర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Delhi Liquor Scam Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడం బీఆర్ఎస్ పార్టీలో కొత్త చిక్కులు రావడానికి కారణం అవుతోంది. లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేతపై స్పందించిన  కేటీఆర్ , ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు అని పేర్కొంటూనే, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిందని  ట్వీట్ చేశారు.  ఈ స్కామ్ అనే  నరేటివ్ వల్ల పార్టీ రాజకీయంగా బలి అయిందని ఆయన చేసిన విశ్లేషణ, పరోక్షంగా ఈ కేసు వల్లనే పార్టీ ఓడిపోయిందనే అర్థాన్ని స్ఫురింపజేసింది.  ఇదే ట్వీట్‌లో తన సోదరి కవితకు న్యాయం జరిగిందన్నారు.     

కేటీఆర్ ట్వట్ పై  కవిత తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసు పార్టీ కోసమేనని, అది వ్యక్తిగతమైనది కాదని  కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె కేసీఆర్ ,  కేటీఆర్ వైఖరిని తప్పుబట్టారు. తాను జైలులో ఉన్న సమయంలో కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను ఇబ్బందులు పడితే, ఇప్పుడు ఓటమిని తన ఖాతాలో వేయడం అన్యాయమని ఆమె భావిస్తున్నారు.    

 

 కేటీఆర్ తన విశ్లేషణలో వ్యవస్థల తీరును ఎండగట్టారు. సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మీడియా ట్రయల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు.  న్యూ ఇండియా లో ఆధారాలు లేకుండానే రాజకీయ నేతలను అప్రతిష్టపాలు చేయడం ఒక అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, భవిష్యత్తులో మిగిలిన నాయకులపై ఉన్న తప్పుడు కేసులు కూడా వీగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  
 
కోర్టు తీర్పు కవితకు వ్యక్తిగతంగా ఊరటనిచ్చినప్పటికీ, అన్నాచెల్లెళ్ల మధ్య తలెత్తిన ఈ వాగ్వాదం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది. ఒకవైపు రాజకీయ విజయం  సాధించామనే సంతోషం ఉన్నా, మరోవైపు ఓటమికి బాధ్యత ఎవరిదనే విషయంలో కుటుంబం ,పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం చర్చనీయాంశంగా మారింది. కవిత రెండు నెలల్లో పార్టీ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆమెను బలపరిస్తే.. అది బీఆర్ఎస్ కు నష్టమని  .. వీలైనంత వరకూ సైలెన్స్ పాటిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Gaddar Awards 2025 : ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget