Vijay Sangeetha Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్ భార్య... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
Thalapathy Vijay Divorce News: దళపతి విజయ్ విడాకుల వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసినట్టు చెన్నై టాక్.

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ స్థాపించి రాజకీయాల్లో అడుగు పెట్టిన దళపతి విజయ్ (Thalapathy Vijay) కుటుంబ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కిందా? హీరో కమ్ పొలిటీషియన్ సంసార జీవితంలో సమస్యలు వచ్చాయా? అంటే... 'అవును' అని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. విడాకుల దిశగా ఆయన భార్య అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
భార్య సంగీత నుంచి విడాకులు కోరుతూ...
దళపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆయన భార్య సంగీత పిటీషన్ దాఖలు చేశారని తమిళ మీడియా పేర్కొంది. ఈ వార్త ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.
Also Read: రష్మికతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడలేదు, పెళ్ళీ చేసుకోలేదు... ఇంకా ఒంటరిగా రక్షిత్ శెట్టి?
పాతికేళ్ళ వివాహ బంధానికి చెల్లు చీటీ??
ఆగస్టు 25, 1999న చెన్నైలో విజయ్, సంగీత వివాహం జరిగింది. వాళ్ళిద్దరిదీ సుమారు 27 ఏళ్ళ సంసార జీవితం. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె కూడా ఉన్నారు. అయితే... ఇప్పుడు విజయ్ భార్య ఎందుకు విడాకులు కోరుతున్నారు? పాతికేళ్ల వైవాహిక బంధానికి ఎందుకు చెల్లు చీటీ ఇస్తున్నారు? అనేది ప్రశ్నగా మారింది.
Also Read: ViRosh Wedding Reception: ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసిన విరోష్... రిసెప్షన్‌కు రమ్మని ఆహ్వానం
View this post on Instagram
రాజకీయ ప్రత్యర్థుల విమర్శల్లో త్రిష పేరు...
విజయ్ మీద విమర్శలు గుప్పించే క్రమంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు సౌత్ క్వీన్, స్టార్ హీరోయిన్ త్రిష పేరు ప్రస్తావిస్తున్నారు. ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చి విజయ్ రాజకీయం చేయాలని ఆ మధ్య బీజేపీ నాయకుడు ఒకరు విమర్శలు చేశారు. విజయ్, త్రిష మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సైతం కోలీవుడ్ గాసిప్. ఈ నేపథ్యంలో విజయ్ కు ఆయన భార్య సంగీత విడాకులు ఇస్తున్నారా? అంటే... 'అవును' అని కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ చూస్తే అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఈ వివాదానికి కాలమే సమాధానం చెప్పాలి.
Also Read: Vishnu Vinyasam Review - 'విష్ణు విన్యాసం' రివ్యూ: శ్రీవిష్ణు సినిమా హిట్టేనా? కామెడీ బావుందా? లేదా?























