Holi Health Tips : హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్!
Holi Health Tips : హోలీ రోజులను రసాయన రంగుల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

Holi Health Tips : రంగులు లేకుండా హోలీ పండుగ ఎలా అవుతుంది? అయితే, ఈ ఆనందకరమైన క్షణాల్లో, మనం తరచుగా మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతాం. మార్కెట్లో లభించే రసాయనాలతో నిండిన రంగులు మన చర్మానికి హాని కలిగించడమే కాకుండా ఇతర సమస్యలకు కారణమవుతాయి.
కొబ్బరి నూనె పూయండి
రసాయన రంగుల నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి, ముందుగా మీ చర్మానికి కొబ్బరి నూనె రాయండి. కొబ్బరి నూనె సహజ నిరోధకంగా పనిచేస్తుంది, చర్మాన్ని తేమగా ఉంచనుంది. రంగు యొక్క హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తుంది. మరింత లోపలికి రంగులు వెళ్లకుండా చూస్తుంది.
పుష్కలంగా నీరు తాగండి
పండుగల సీజన్‌లో పుష్కలంగా నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా మీ చర్మాన్ని లోపలి నుంచి తేమగా చేస్తుంది. దీని వల్ల రంగులు పైనే ఉంటాయి. డ్రైగా ఉన్న శరీరంపై రసాయన రంగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
సన్‌స్క్రీన్ వాడండి
హోలీ ఎండలో ఆడుకొనేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం మరచిపోవద్దు. మంచి SPF ఉన్న సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని సూర్యుడి హానికరమైన UV కిరణాల నుంచి కాపాడుతుంది.
సహజ రంగులను వాడండి
వీలైతే, రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను వాడండి. సహజ రంగులు మీ చర్మానికి సురక్షితమైనవి మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా మంచివి.
ముల్తానీ ప్యాక్ వాడండి
పండుగ తర్వాత, మీ చర్మాన్ని శుభ్రపరచడానికి ముల్తానీ మిట్టి ప్యాక్ వేయండి. ఇది మీ చర్మం నుంచి మరకలను తొలగించడమే కాకుండా, తాజాగా ,ప్రకాశవంతంగా ఉంచుతుంది.























