అన్వేషించండి

Honda Amaze Vs Maruti Dzire: రెండు కార్లకూ 5 స్టార్ రేటింగ్! కానీ స్కోర్లు, సేఫ్టీ ఫీచర్లలో ఏ కార్ బెస్ట్?

Honda Amaze, Maruti Dzire రెండు కార్లు Bharat NCAPలో 5 స్టార్ రేటింగ్ తెచ్చుకున్నాయి. అయితే AOP, COP స్కోర్లు, క్రాష్ టెస్ట్ ఫలితాలు, సేఫ్టీ ఫీచర్లలో ఏ కార్ ముందుందో ఈ వివరాలతో స్పష్టమవుతుంది.

Honda Amaze Vs Maruti Dzire Safety Rating: భారత ఆటో మార్కెట్లో సబ్‌–4 మీటర్‌ సెడాన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో హోండా అమేజ్, మారుతి సుజుకి డిజైర్ మధ్య పోటీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. 2025లో భారత్ NCAP టెస్ట్‌లు జరిగాక ఈ రెండు కార్లూ 5 స్టార్ రేటింగ్ సాధించాయి. అయితే స్కోర్లు, ఇండివిడ్యువల్‌ టెస్ట్ ఫలితాల్లో ఏ కారు ముందుంది? ప్రజలకు ప్రాక్టికల్‌గా ఏ కార్‌ సేఫ్ అనేది ఈ స్టోరీతో స్పష్టంగా అర్ధమవుతుంది.

AOP స్కోరు: రెండు కార్లకు 5 స్టార్ – కానీ డిజైర్ కొద్దిగా ముందుంది

Honda Amaze – 28.33/32
Maruti Dzire – 29.46/32

రెండు కార్లకూ 5 స్టార్ రేటింగ్ వచ్చినా, డిజైర్ మొత్తం స్కోరులో 1.13 పాయింట్లు ఎక్కువ సాధించింది. అంటే ఫ్రేమ్ స్ట్రక్చర్, ఇంపాక్ట్ అబ్జార్ప్షన్ విషయంలో అది కొంచెం మెరుగ్గా ఉంది.

ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌లో అమేజ్‌కు అడ్వాంటేజ్

Amaze లో డ్రైవర్, కో–డ్రైవర్ రెండు సీట్లకూ హెడ్, నెక్, పెల్విస్, థైస్, ఫీట్ అన్నీ ‘గుడ్’ ప్రొటెక్షన్ ఇచ్చాయి. డ్రైవర్ ఛెస్ట్, టిబియాస్ మాత్రమే ‘అడిక్వేట్’ రేటింగ్ పొందాయి.

Dzire లో... డ్రైవర్ ఛెస్ట్‌కు ‘వీక్’ రేటింగ్ రావడం గమనించాల్సిన విషయం. కో-డ్రైవర్ ఛెస్ట్ ‘అడిక్వేట్’ రేటింగ్ పొందింది.

హోండా అమేజ్ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్ స్కోరు మెరుగ్గా రావడానికి ఇదే ప్రధాన కారణం.

సైడ్ బారియర్ టెస్ట్‌లో డిజైర్ విజయవంతం

ఈ టెస్ట్‌లో:

Amaze – హెడ్, అబ్డమెన్, పెల్విస్ - ‘గుడ్’ రేటింగ్‌ & ఛెస్ట్ - ‘మార్జినల్’ (సేఫ్టీ స్థాయిలో తగ్గుదల)

Dzire – అన్నింటికీ ‘గుడ్’, ఛెస్ట్‌కు ‘అడిక్వేట్’ రేటింగ్‌.

ఈ ఫలితం కారణంగా, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో మారుతి డిజైర్ 1.29 పాయింట్లు ఎక్కువ సాధించింది.

సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్: రెండు సమానంగా బలమైన కార్లు

ఈ టెస్ట్‌లో రెండు కార్లూ అన్ని క్రిటికల్ భాగాలకు ‘గుడ్’ ప్రొటెక్షన్ అందించాయి. అంటే, రియల్ వరల్డ్‌లో హార్డ్ ఇంపాక్ట్‌లో కూడా రెండు కార్లూ మంచి రక్షణ ఇస్తాయి.

COP స్కోర్లు: పిల్లల భద్రతలో డిజైర్ ముందుంది

Honda Amaze – 40.81/49
Maruti Dzire – 41.57/49

రెండు కార్లలోనూ 18 నెలల డమ్మీలకు సైడ్ ప్రొటెక్షన్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఫ్రంటల్ ప్రొటెక్షన్ విషయంలో అమేజ్ 8/8 పాయింట్లు సాధించగా, డిజైర్ 7.57 సాధించింది. అయినా తుది COP స్కోరులో డిజైర్ వరల్డ్ అసెస్‌మెంట్‌లో 1 పాయింట్ అదనంగా పొందింది. అందుకే డిజైర్‌కు 5 స్టార్, అమేజ్‌కు 4 స్టార్ రేటింగ్ వచ్చింది.

సేఫ్టీ ఫీచర్లు: అమేజ్‌లో మునుపెన్నడూ లేని అడ్వాంటేజ్

రెండు కార్లలో కూడా స్టాండర్డ్‌గా ఉన్న ఫీచర్లు:

  • 6 ఎయిర్‌బ్యాగ్స్
  • ISOFIX మౌంట్స్
  • ESC
  • హిల్ హోల్డ్
  • 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు

Amaze ప్రత్యేకతలు:  సెగ్మెంట్-ఫస్ట్ Level 1 ADAS, లేన్ వాచ్ కెమెరా

Dzire ప్రత్యేకత: 360° కెమెరా

ధరలు (ఎక్స్-షోరూమ్):

Honda Amaze – ₹7.41 లక్షలు నుంచి ₹10 లక్షలు ‍‌(ఎక్స్‌-షోరూమ్‌)
Maruti Dzire – ₹6.26 లక్షలు నుంచి ₹9.31 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

ఈ ధరల్లో డిజైర్ మరింత అందుబాటులో ఉంటుంది.

ఫైనల్‌గా... 

  • అమేజ్ ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌లో మెరుగ్గా రాణించింది.
  • డిజైర్ సైడ్ ఇంపాక్ట్ & చైల్డ్ సేఫ్టీ రేటింగ్‌లో ముందుంది.
  • ఫీచర్ల విషయానికి వస్తే - ADAS వల్ల అమేజ్‌కు హైటెక్ అడ్వాంటేజ్ ఉంది.
  • భద్రతను మాత్రమే చూస్తే - డిజైర్ కాస్త ముందుంది.
  • ఫీచర్లు + ఫ్రంటల్ సేఫ్టీ కాంబినేషన్ కావాలంటే - హోండా అమేజ్ మంచి ఆప్షన్.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
భారత్‌లో అత్యధికంగా కొంటున్న Top 5 Sedan Cars.. ఇందులో మీ కారు ఉందా
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget