Kavitha Latest News: BRS నేతలపై కవిత ఆరోపణలకు సమాధానం ఇంకెన్నాళ్లు..? కేసీఆర్ లైట్ తీసుకుంటే.. జనం వదిలేస్తారా?
Kavitha Latest News: కేసీఆర్ కుటుంబంలో కవిత సంక్షోభం ముగిసిందని BRS భావిస్తోంది. కానీ ఆమె చేసిన ఆరోపణలు ఇంకా పార్టీని వెంటాడుతున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది.

Kavitha Latest News: BRS పార్టీ నుంచి సస్పెషన్ తరువాత కవిత ఎపిసోడ్ ముగిసినట్లేని ఆ పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారా.. అలా కాకుంటే మరి కవిత చేసిన ఆరోపణలపై నేటికీ ఎందుకు స్పందిలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా పది రోజుల క్రితం కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి , హరీష్ రావుపై తీవ్ర స్దాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కాలేశ్వరంలో అవినీతికి కారణం అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీషన్ రావే., అక్రమంగా డబ్బు సంపాదించకపోతే, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఎలా చేశారాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణల సమయంలో హరీష్ రావు విదేశాలలో ఉన్నారు. తిరిగి ఇండియా వచ్చిన తరువాత కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారని పొలిటికల్ సర్కిల్ లో గట్టి టాక్ నడించింది. కానీ కవిత చేసిన అవినీతి ఆరోపణలపై హరీష్ రావు ఒక్కమాట మాట్లడలేదు. హరీష్ రావు, ఎంపీ సంతోష్ వల్లనే కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోబోతున్నారని, ఇంకా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లడితే, తనకేం పట్టనట్లుగా హరీష్ రావు ఎందుకు వ్యవహరించారనేది నేటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.
హరీష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే విమర్శలకు హరీష్ రావు నుంచి కౌంటర్ వస్తుందని ఆశించినా ఆ ఊసే లేదు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తరువాత రోజు కూడా ఏమాత్రం టార్గెట్ హరీష్ ఎక్కడా గురితప్పలేదు. తాను పార్టీలో ట్రబుల్ షూటర్ కాదు , బబుల్ షూటర్ అంటూ రెచ్చిపోయారు కవిత. ఎంపీ సంతోష్ దళితులపై దాడులు చేయించి, లబ్ధిపొంది, నిందలు మాత్రం కేటీఆర్ పై వేశారని సంతోష్ పై చేసిన విమర్శలకు ఎంపీ సంతోష్ నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఇలా వీరిద్దరూ మాట్లడలేదు సరే, అన్న కేటీఆర్ స్పందిస్తారని ఊహిస్తే , ఆయన కూడా కవితపై వేటు పార్టీ సమష్టి నిర్ణయం అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు.
ఇలా పార్టీలో కేసీఆర్ తరువాత అంతటి చరిస్మా కలిగిన హరీష్ రావును గుక్కతిప్పకుండా అవినీతి అస్త్రాలు సందిస్తే, ఏ ఒక్కరూ కవిత ఆరోపణలను ఖండించడం చేయలేదు. ఇదే విమర్శలు బీఆర్ఎస్ పార్టీలో మరో నేత చేసుంటే, అధికార పార్టీ ఆరోపించి ఉంటే , ఇంత మౌనం ఉండేవారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు అవినీతి చేసారని తన తండ్రికి అనేకసార్లు చెప్పానని కవిత అంటోంది. అలా కూతరు చెప్పినా అల్లుడిని సమర్ధిస్తూ వచ్చారంటే , ఆ అవినీతిలో కేసీఆర్ కు వాటా లేకుండా ఉంటుందా అనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే బిఆర్‌ఎస్‌పై కుటుంబ పార్టీ అనే ముద్ర ఉంది. ఇప్పుడు కవిత ఎపిసోడ్‌లో ఆశించిన స్దాయిలో హరీష్ రావు, ఎంపీ సంతోష్ , కేటీఆర్ స్పందించక పోవడంతో మనం మనం బరంపురం అనే సామెతను గుర్తుచేస్తున్నట్లుందట. అవినీతి అధికారులను ప్రోత్సహించారు, ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చారు, నా ఓటమికి కుట్ర పన్నారు, రేవంత్ రెడ్డితో కలసి విమానంలో ప్రయాణించినప్పుడే హరీష్ రావు వెన్నుపోటు బయటపడింది, దళితులపై దాడులలో కేటీఆర్‌ను ఇరికించారు, ఇలా అనేక ఆరోపణలు నేటికీ బిఆర్ ఎస్‌ను కవిత రూపంలో వెంటాడుతున్నాయి. కవిత గీత దాటారని వేటు వేశారు సరే, మరి ఈ ప్రశ్నలకు సమధానం చెప్పక్కర్ల లేదా? అలా వదిలేస్తే కొన్నాళ్లకు జనం కూడా లైట్ తీసుకుంటారనే భావనలోకి కేసీఆర్ వెళ్లారా? లేక కవిత వ్యాఖ్యలపై మాట్లడితే కన్న కూతురిని విమర్శించాల్సి వస్తుంది కాబట్టి మౌనం వహిస్తున్నారా అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. తన తండ్రితో మాట్లడి ఏకంగా 100 రోజులు దాటిందని కవిత మీడియాతో మాట్లడుతూ మనసులో మాట చెప్పేశారు. మరి కవితను వంద రోజుల నుంచి కేసీఆర్ దూరం పెట్టడానికి కారణాలు ఏవనే క్లారిటీ పార్టీ వర్గాలకు సైతం అంతుచిక్కడం లేదట. మొత్తానికి కవిత చేసిన గాయం బీఆర్ ఎస్ ను సమాధానం చెప్పుకోలేని, ప్రశ్నల రూపంలో వెంటాడటమేకాదు, అధికార పార్టీకి సైతం భ్రహ్మాస్త్రంగానే మారనుందనే వాదనలలు వినిపిస్తున్నాయి.





















