అన్వేషించండి

Puducherry Elections 2026: పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !

Pondicherry Politics: త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న పుదుచ్చేరిలో విజయ్ పార్టీ టీవీకే కీలక పాత్ర పోషించబోతోంది. ఆ పార్టీ గెలవకపోయినా కింగ్ మేకర్ గా నిలుస్తుందన్న అంచనాలు వస్తున్నాయి.

Whose side are the people on in the Puducherry elections:  పుదుచ్చేరి రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల మధ్య ముక్కోణపు పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ , భారతీయ జనతా పార్టీ  కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ముఖ్యమంత్రి రంగసామి తనదైన శైలిలో సంక్షేమ పథకాలను నమ్ముకోగా, బీజేపీ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా  డబుల్ ఇంజిన్ సర్కార్  నినాదంతో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. అయితే, పాలనలో అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం వంటి అంశాలు ప్రభుత్వానికి కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్-డీఎంకే కూటమిలో కుమ్ములాటలు 

ప్రతిపక్ష ఇండియా  కూటమిలో కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు మరియు నాయకత్వం విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా డీఎంకే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూడటం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే సీపీఐ  ఏకపక్షంగా తన ప్రచారాన్ని ప్రారంభించడం కూటమిలో సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. ఈ విభేదాలు అధికార పక్షానికి కలిసొచ్చే అంశంగా మారాయి.

విజయ్ టీవీకే ఎంట్రీ అసలు సిసలు ట్విస్ట్                               

తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం పుదుచ్చేరి రాజకీయాల్లో డార్క్ హార్స్ గా మారుతోంది. గతేడాది డిసెంబర్‌లో పుదుచ్చేరిలో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసి పాత తరం పార్టీలు ఖంగుతిన్నాయి. యువత ,  మహిళా ఓటర్లను టీవీకే విపరీతంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామన్న విజయ్ హామీ స్థానిక ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. డీఎంకే, ఏఐఏడీఎంకేలను విజయ్ టార్గెట్ చేయడం కలసి వస్తోంది. 

ఎవరికి ఎడ్జ్ ఉంది? 

ప్రస్తుతానికి అధికార AINRC-BJP కూటమికి కొంత పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, టీవీకే చీల్చే ఓట్లు ఎవరి కొంపముంచుతాయో అన్న భయం అన్ని పార్టీల్లో ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాల్లో ఈ సారి టీవీకే కీలకం కానుంది. టీవీకే గెలిచే స్థానాల కంటే, ఇతర పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకుంది. దీనివల్ల ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా కొట్టిపారేయలేరని అంచనా వేస్తున్నారు.  పుదుచ్చేరి ఓటర్లు ఎప్పుడూ విభిన్నమైన తీర్పు ఇస్తుంటారు. ఒకవైపు రంగసామి వ్యక్తిగత ఇమేజ్, మరోవైపు కాంగ్రెస్ పాత క్యాడర్, ఇంకోవైపు విజయ్ కొత్త క్రేజ్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఏప్రిల్-మేలో జరగబోయే ఈ ఎన్నికల్లో మార్పు  కోరుకునే యువత టీవీకే వైపు మొగ్గితే పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.  

టాప్ హెడ్ లైన్స్

MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
Telangana El Nino Water Crisis : ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
Embed widget