SA20 Auction Highlights | SA20 వేలంలో కోట్లు కురిపించిన ఫ్రాంఛైజీలు
సౌత్ ఆఫ్రికా టీ20 మెగా లీగ్ 4th ఎడిషన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో డివాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్ మార్‌క్రమ్ రికార్డులు బద్దలు కొట్టారు. ఈ ఇద్దరు ప్లేయర్స్ పై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి.
బేబీ ఏబీగా పిలవబడే డివాల్డ్ బ్రెవిస్‌ను 8.30 కోట్లు పెట్టి ప్రిటోరియా క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న బ్రెవిస్ ను టీమ్ లోకి తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఫ్రాంఛైజీ.. మొత్తానికి సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ SA20 లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్‌ను రెండుసార్లు విజేతగా నిలిపిన ఎయిడెన్ మార్‌క్రమ్ ఈసారి ఫ్రాంఛైజీ మారాడు. మార్‌క్రమ్ ను డర్బన్ సూపర్ జెయింట్స్ 7 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నాలుగో సీజన్‌లో ఈ సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నాలుగో ఎడిషన్.. 2025 డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. 2026 జనవరి 26న ముగియనుంది.





















