Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP Desam
చర్చి పాస్టర్లు చందాల దందా చేస్తున్నారని, వేల కోట్లు పోగుపడుతున్నాయని పాస్టర్ అజయ్ బాబు ఆరోపించారు. దమ్ముంటే రెండు రాష్ట్రాల సీఎంలు చర్చి పాస్టర్లపై ఐటీ రైడ్స్ చేయాలని డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక వేత్తల వద్ద వేల కోట్లు ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తమ వద్ద ఉన్న డబ్బంతా ప్రభుత్వమే తీసుకుని చర్చిలన్నింటిని దేవాదాయ శాఖ పరిధిలోకి తేవాలని, తమకు మాత్రం క్రీస్తు సువార్తను ప్రకటించే స్వేచ్ఛ మాత్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో కుల గణన జరిగితే తమ క్రైస్తవుల సంఖ్య చెప్పలేదని వాపోయారు. క్రైస్తవ్యంలోకి ఏ కులం వారు వచ్చినా వారి కులం మారదని, కాని దళితులకే కులం ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. రాధా మనోహర్ దాస్ తో డిబెట్ కు రడీ అని పాస్టర్ అజయ్ చెప్పారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పట్టించుకోవాలంటూ ఓ సంచలన ప్రతిపాదన ఉంచారు పాస్టర్ అజయ్.





















