అన్వేషించండి

Speaker Decision: అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?

Supreme Court: తెలంగాణలో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై న్యాయపరమైన ఉత్కంఠకు తెరపడింది. రాజీనామాలపై నిర్ణయాలను నిర్దిష్ట గడువులోపు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్లపై ఉందని తేల్చినట్లయిది.

Speaker decision on disqualification petitions:  తెలంగాణలో  కొంతకాలంగా సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టు గురువారం  కీలక ముగింపునిచ్చింది. స్పీకర్ నిర్ణయం ప్రకటించినందుకు పిటిషన్లపై విచారణ ముగించింది.  తక్షణమే ఎవరిపై అనర్హతా వేటు పడకపోయినప్పటికీ, భవిష్యత్తు రాజకీయాల కోసం ఒక బలమైన  న్యాయపరమైన బెంచ్ మార్క్ ని ఈ పిటిషన్లు సృష్టించాయి.  

కాలయాపనకు అడ్డుకట్ట                                

సాధారణంగా పార్టీ ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్లు తమకు ఉన్న  విచక్షణాధికారం పేరుతో అనర్హతా పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతుంటారు. అసెంబ్లీ పదవీకాలం ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా నాన్చడం ద్వారా ఫిరాయింపుదారులకు మేలు జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ వేసిన పిటిషన్ల కారణంగా సుప్రీంకోర్టు ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద స్పీకర్ ఒక ట్రిబ్యునల్  లాగా వ్యవహరించాలని, నిర్ణయాలను సకాలంలో వెల్లడించాలని స్పష్టం చేసింది.

నిర్దిష్ట గడువు - తప్పనిసరి బాధ్యత                                 

ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్పీకర్‌కు స్పష్టమైన గడువులను విధించడం ఒక మైలురాయిగా నిలిచింది. స్పీకర్ పదవికి రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ, అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ఈ పరిణామం నిరూపించింది. గతం ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా, ఫిర్యాదు అందిన మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలనే నిబంధనను ఈ కేసు మరింత బలోపేతం చేసింది.

కోర్టు ధిక్కార హెచ్చరికలు                                     

పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని  తీవ్రమైన కోర్టు ధిక్కారం గా సుప్రీంకోర్టు అభివర్ణించడం చర్చనీయాంశమైంది. స్పీకర్ కార్యాలయం అనేది అనర్హతా పిటిషన్లు   అసెంబ్లీ గడువు ముగియడం పొందే వరకు వేచి చూసే వేదిక కాకూడదని జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ హెచ్చరికల ఫలితంగానే, సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ కంటే ముందే స్పీకర్ అన్ని పిటిషన్లపై తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చింది.                     

నిర్ణయం ఏదైనా స్పీకర్ ప్రకటించాల్సిందే !  
 
ఈ కేసు ఫలితంగా పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించినప్పటికీ, న్యాయపరంగా చూస్తే ఇది పిటిషనర్ల విజయంగానే భావించవచ్చు. ఎందుకంటే, నిర్ణయాన్ని వాయిదా వేసే హక్కు స్పీకర్‌కు లేదని, అది కేవలం రాజ్యాంగబద్ధమైన బాధ్యత మాత్రమేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా స్పీకర్లు అనర్హతా పిటిషన్లపై ఇష్టానుసారంగా కాలయాపన చేయడానికి వీలులేని విధంగా ఒక గట్టి సంకేతాన్ని ఈ తీర్పు పంపింది. 

టాప్ హెడ్ లైన్స్

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
Breaking News: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget