Balabhadrapuram Cancer Cases: బలభద్రపురానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా, భారీగా వైద్య బృందాల మోహరింపు
East Godavari Latest News: బలభద్రపురానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించిన వైద్యశాఖ మంత్రి భారీగా వైద్య బృందాలు పంపించారు.

East Godavari Latest News: తూర్పుగోదావరి జిల్లా బలబద్రపురంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ స్పందించారు. బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని మరణాలు అదే స్థాయిలో ఉన్నయని సభ దృష్టికి తెచ్చారు.
ఎమ్మెల్యే చెప్పడంతో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వే ప్రారంభించారు. ఈ విషయాన్ని హెల్త్ మినిష్టర్ సత్యకుమార్ మీడియాకు తెలిపారు. ఈ అంశంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య శాఖ ఇప్పటికే గతేడాది నవంబర్ నుంచి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నిర్ధారించే క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 47% జనాభాను కవర్ చేశామని వెల్లడించారు. బలభద్రపురం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షల కోసం 31 వైద్య బృందాలు నియమించామని వివరించారు. వారిలో ఆరోగ్య కార్యకర్తలు, సహాయక నర్సులు, గుర్తింపు పొందిన ఆశా వర్కర్లు ఉన్నారు. వీరికి ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కాకినాడ వైద్య కళాశాల, జిఎస్ఎల్ వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అధిస్తున్నాయని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల భయం నేపథ్యంలో గ్రామంలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులు, సర్వే వివరాలపై సమీక్ష నిర్వహించాను. బలభద్రపురం గురించి తెలియగానే అక్కడికి 31 వైద్య బృందాలను పంపాం. వైద్య నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారిని మినహాయించి… pic.twitter.com/QphGlwfjLs
— Satya Kumar Yadav (@satyakumar_y) March 24, 2025
ప్రసుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. పింక్ రిబ్బన్ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బలభద్రపురం గ్రామంలో 3,500 గృహాలుండగా 10,800 మంది జనాభా ఉండగా వైద్య బృందాలు 2025 ఇప్పటి వరకు 8,830 మంది వ్యక్తులను కవర్ చేస్తూ 2,803 గృహాలు సర్వే చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తిస్తున్నట్టు తెలిపారు. గత మూడేళ్ళుగా క్యాన్సర్ వల్ల ెంత మంది మరణించారో కూడా సర్వే చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇప్పటి వరకు చేసిన సర్వేలో 38 మంది వ్యక్తుల్లో అనుమానిత క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తెలిపారు. ఆ ఊరి మొత్తం జనాభాలో సుమారు10% నుంచి 15% వరకు పాజిటివ్‌గా ఉంటుందని తెలిపారు. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ 6 కేసులుగా ఉండగా, 7 మందిలో గర్భాశయ క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు వివరించారు. 2 కేసుల్లో మెదడు క్యాన్సర్, 3 కేసుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యక్తులు ఉన్నారని చెప్పారు.
14 మంది వ్యక్తులకు మల్టీ క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇంకా 17 మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో రొమ్ము క్యాన్సర్ ఉన్న వారు ఐదుగురు, బహుళ క్యాన్సర్ రకాలు 9మందిలో, మెదడు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్లు ముగ్గురు ఉన్నారు. గతంలో నిర్ధారించిన కేసుల్లో 15 మంది చికిత్స అనంతరం ఆరోగ్యంగా బయటపడ్డారు. ఈ కేసుల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్సలు పొందినట్టు చెప్పారు. గత మూడు సంవత్సరాల్లో 19 క్యాన్సర్ సంబంధిత మరణాలు జరిగాయని సర్వే బృందాలు గుర్తించాయి.
ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా క్యాన్సర్ భారం క్రమంగా పెరుగుతున్నట్లు గమనించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నోటి, రొమ్ము క్యాన్సర్‌లకు 18+ వయస్సు గల మొత్తం జనాభాకు, గర్భాశయ క్యాన్సర్‌కు 30+ వయస్సు గల మహిళకు సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్‌ను చేపట్టామని తెలిపారు. మొత్తం 4.09 కోట్ల మందికి స్కీనింగ్ చేయాలని లక్ష్యం కాగా ఇప్పటికే 1.93 కోట్ల జనాభా స్క్రీనింగ్ పూర్తి చేసి 1,45,649 అనుమానితుల్లో 95,263 మందిని పీహెచ్సీ వైద్య బృందాలు పరీక్షించాయని తెలిపారు.
మూడేళ్లలో లక్షపైగా క్యాన్సర్ కేసులు.. కాకినాడ జిల్లాలోనే అధికం
రాష్ట్రంలో 2022 నుంచి 2025 వరకు 1,13,363 క్యాన్సర్ రోగులకు చికిత్స అందించారు. అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలో 5,931 (5.23%) కాగా మిగతావి విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. బలభద్రపురంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆందోళన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించగలిగితే చికిత్స సులభం
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు మాట్లాడుతూ క్యాన్సర్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాధని క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని సకాలంలో తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ణప్తి చేశారు. క్యాన్సర్ కారకాలను గుర్తించిన వారికి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం హోమీ బాబా క్యాన్సర్ కేంద్రం ద్వారా గాని లేదా ఎన్టీఆర్ వైద్య సేవలో ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని ఆప్సన్ ఇస్తున్నామని తెలిపారు. అంతేగాక క్యాన్సర్‌కు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవలో 256 ప్రొసీజర్లను పొందుపరిచినట్టు వివరించారు. .
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

