Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోక్ మానేజ్మెంట్ పేరుతో మ్యాచులకు దూరమవుతున్న విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్ లో జరిగిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు మాత్రమే ఆడిన జస్ప్రిత్ బుమ్రా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆడలేదు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మళ్లీ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఇదే విషయానికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
‘బుమ్రాని ఎలా వాడాలో తెలియాలంటే ముందు మీకు బుర్రలు ఉండాలి. కాస్త కామన్ సెన్స్. అతన్ని పూర్తిగా వైట్ బాల్ బౌలర్‌గా మార్చేశారు. ఇప్పుడు రెడ్ బాల్ బౌలర్‌గా మారమంటే ఎలా మారతాడు అంటూ టీమ్ మానేజ్మెంట్ పై ఫైర్ అయ్యారు. బుమ్రాని ఎలా వాడాలో తెలియకపోతే ఓసారి నా కోచింగ్‌లో అతను ఎలా వాడేవాడో కాస్త రీప్లే చేసి చూడండి’ అని అన్నారు. రవి శాస్త్రి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి చేసినవే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.





















