IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IAS Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. మరో ఐఏఎస్ అధికారిని ఏపీకి పంపి తాను తెలంగాణకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

IAS Amrapali attempts to come to Telangana fail again: ఐఏఎస్ అధికారి అమ్రపాలి కాటాను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని జారీ చేసిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) జారీ చేసిన ఆర్డర్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) క్యాట్ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. CAT ఆర్డర్ ప్రకారం అమ్రపాలిని తెలంగాణకు కేటాయించడానికి ఐఏఎస్ హరికిరణ్‌తో స్వాప్ అరేంజ్‌మెంట్ చేయాలని ఆదేశించింది. కానీ DOPT "స్వాపింగ్ రూల్స్ అమ్రపాలికి వర్తించవని" వాదించింది. హరికిరణ్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి స్వాప్ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అమ్రపాలిని కౌంటర్ ఫైల్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా పడింది.
రాష్ట్ర విభజన తర్వాత ఆలిండియా సర్వీస్ అధికారులకు క్యాడర్ సమస్యలు
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) అధికారుల క్యాడర్ కేటాయింపు ప్రక్రియ దీర్ఘకాలిక వివాదాలకు దారితీసింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల ఆధారంగా గైడ్‌లైన్స్ రూపొందించారు. ఈ ప్రక్రియలో అమ్రపాలి కాటా 2010 బ్యాచ్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించారు. అయితే ఆమె తెలంగాణలోనే కొనసాగాలని కోరుకున్నారు. కానీ గతేడాది అక్టోబర్‌లో DOPT తనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆర్డర్‌పై CATకు పిటిషన్ దాఖలు చేసింది. CAT హైదరాబాద్ బ్రాంచ్ జూన్ 2025లో ఆమెకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. ఇతర అధికారులకు అనుమతి ఇచ్చినప్పుడు అమ్రపాలికి ఎందుకు వర్తింప చేయలేదని.. స్వాప్ అరేంజ్‌మెంట్ ద్వారా తెలంగాణకు కేటాయించాలని క్యాట్ ఆదేశించింది.
హరికిరణ్ తో క్యాడర్ మార్పుపై డీవోపీటీ అభ్యంతరం
దీని ప్రకారం ఐఏఎస్ సి. హరికిరణ్ తో స్వాప్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం అమ్రపాలి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. CAT ఆర్డర్‌పై DOPT తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వాపింగ్ ప్రొవిజన్స్ అమ్రపాలి కేసులో వర్తించవని హరికిరణ్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి, అతని క్యాడర్ కేటాయింపుపై మార్పులు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. క్యాడర్ రూల్స్‌లో రిజర్వ్డ్ కేటగిరీ అధికారులకు ప్రత్యేక రక్షణ ఉందని, ఇది వైస్ గవర్నెస్ పాలసీలకు విరుద్ధమని DOPT పిటిషన్‌లో పేర్కొంది.
కేసు ఆరు వారాలకు వాయిదా
ఈ కేసు తెలంగాణ-ఆంధ్ర విభజన తర్వాత AIS అధికారుల మధ్య ఎదురయ్యే సాధారణ సమస్యలను ప్రతిబింబిస్తోంది. 2024 అక్టోబర్‌లో DOPT ఆర్డర్ ప్రకారం అమ్రపాలి తో పాటు వాణి ప్రసాద్, రొనాల్డ్ రోజ్, కరుణ వాకాటి వంటి అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్లాల్సి వచ్చింది. CATలో వారు విజయం సాధించినా, DOPT హైకోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ ఆగిపోయింది.





















