అన్వేషించండి

IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?

IndiGo : ఇండిగో పైలట్ల సంక్షోభం కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోతున్నాయి.


IndiGo looks set to face severe financial losses:  భారతదేశంలోని అతిపెద్ద లో-కాస్ట్ ఎయిర్‌లైన్ ఇండిగో కంపెనీ  ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.  కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల అమలు వల్ల డిసెంబర్ మొదటి వారంలో 2,000కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 5.86 లక్షల మంది ప్రయాణికులు  ఇబ్బందులు పడ్డారు.  ఈ కంపెనీ నిర్లక్ష్యంతో మూడీస్ రేటింగ్స్ వంటి గ్లోబల్ ఏజెన్సీలు "క్రెడిట్ నెగెటివ్" మారుతుదంని హెచ్చరికలు జారీ చేశాయి.   

ఇండిగో సంక్షోభం పీక్ వింటర్ సీజన్‌లో జరిగడం వల్ల ఆర్థిక దెబ్బ తీవ్రంగా ఉంది. మూడీస్ రేటింగ్స్ ప్రకారం, విమానాల రద్దు వల్ల రెవెన్యూ నష్టం, రిఫండ్‌లు, కంపెన్సేషన్‌లు, DGCA పెనాల్టీలు ఆ సంస్థకు తీవ్ర నష్టాలను కలిగించనున్నాయి.  డిసెంబర్ 7 నాటికి రూ. 610 కోట్లు రిఫండ్‌లు ప్రాసెస్ చేశారు. మొత్తం రిఫండ్‌లు రూ. 827 కోట్లకు చేరాయి. ఇంకా పెండింగ్ రిఫండ్‌లు, బ్యాగేజ్ డెలివరీలు ఉన్నాయి. ఇది క్వార్టర్లీ టాప్‌లైన్‌ను 5-7% తగ్గిస్తుందని నిపుణులు అంచనా.
  
సెప్టెంబర్ 2025 క్వార్టర్ లో ఇండిగో నెట్ లాస్ రూ. 2,614 కోట్లు రికార్డ్ చేసింది. డిసెంబర్ క్రైసిస్ వల్ల Q3 FY26లో రెవెన్యూ 17% పెరుగుదల ఉంటుందన్న ఆశలు కుప్పకూలాయి. ఫ్యూయల్ కాస్ట్‌లు, రూపాయి డెప్రిసియేషన్ వల్ల అదనపు  భారం కనిపిస్తోంది.    డిసెంబర్ 7న 1,650 విమానాలు ఆపరేట్ చేశారు. సాధారణంతో 2,200తో పోలిస్తే తక్కువ. డిసెంబర్ 10 నాటికి నార్మల్ అవుతుందని ఇండిగో చెప్పినప్పటికీ, పీక్ సీజన్ నష్టం రూ. 1,000-1,500 కోట్లకు చేరవచ్చు.
 
క్రైసిస్ వల్ల ఇంటర్‌గ్లోబ్ షేర్ ప్రైస్ పడిపోయింది.   డిసెంబర్ 1 నుంచి 8 వరకు 13.5% డ్రాప్, మార్కెట్ క్యాప్ రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 1.94 లక్షల కోట్లకు తగ్గింది . రూ. 34,000 కోట్లు ఇన్వెస్టర్ల  సొమ్ము తగ్గిపోయింది.   డిసెంబర్ 8న 8-9% పడిపోయింది., 2022 ఫిబ్రవరీ తర్వాత అతి పెద్ద సింగిల్-డే లాస్.  JM ఫైనాన్షియల్  రిడ్యూస్  రేటింగ్ ఇచ్చి, టార్గెట్ రూ. 4,000కి డౌన్ చేసింది  .    ఇన్వెస్టర్లు రెగ్యులేటరీ స్క్రూటినీ, రిఫండ్ లయబిలిటీలు, ఫ్యూయల్ కాస్ట్‌ల వల్ల భయపడ్డారు. 
 
ఇండిగో  పంక్చువాలిటీ & రిలయబిలిటీ  బ్రాండ్‌గా ఉండి, 66% మార్కెట్ షేర్ కలిగి ఉంది. కానీ ఈ క్రైసిస్ దాని ఇమేజ్‌ను దెబ్బతీసింది. ఎయిర్‌పోర్టుల్లో క్యూస్, బ్యాగేజ్ డిలేలు,  వన్-టైమ్ పెర్ఫార్మెన్స్ (OTP) 35% నుంచి 8.5%కి పడిపోయింది. ప్రయాణికులు అల్టర్నేటివ్ ఫ్లైట్‌లకు 10 రెట్లు ఫేర్‌లు చెల్లించాల్సి వచ్చింది .  ఇండిగో సంస్త ఇప్పటికే  రూ. 74,813 కోట్ల అప్పుల్లో ఉంది. క్రైసిస్ వల్ల ఒత్తిడి పెరిగుతుంది.   రిఫండ్‌లు, పెనాల్టీలు  అప్పుల భారాన్నిపెంచుతాయి.   FDTL నిబంధనల వల్ల ఖర్చులు  25% పెరగవచ్చు.   క్రైసిస్ వల్ల రీఫైనాన్సింగ్ కష్టం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ఏర్పాటు చేశారు. కానీ ప్రయాణికుల నమ్మకాన్ని పెంచుకోవడం అంత తేలిక కాదని చెబుతున్నారు. మొత్తం మీద ఇండిగో తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్న చందంగా  సంక్షోభాన్ని తెచ్చుకుంది.   

 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget