అన్వేషించండి

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

Spotify Premium For VI users | Vi రూ.435, రూ.250, రూ.230ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా ఉచిత స్పాటిఫై ప్రీమియం, డేటా, అపరిమిత కాల్స్, వివిధ OTT సేవలను Vi యాప్ ద్వారా అందిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఉచిత స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.
  • రూ.435, రూ.250 ప్లాన్‌లు డేటా, అపరిమిత కాల్స్, SMS ప్రయోజనాలిస్తాయి.
  • రూ.230 ప్యాక్ 30GB డేటా, 20+ OTT ప్రయోజనాలతో అందుబాటులో ఉంది.
  • Vi యాప్ ద్వారా స్పాటిఫై ప్రీమియంను సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ప్రముఖ టెలికాం సంస్థ Vi 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఒకే రీఛార్జ్‌తో ప్రీమియం సంగీతం, వినోదం, అధునాతన డేటా ప్రయోజనాలను పొందేలా ఈ ప్లాన్లు, మ్యూజిక్ ఆఫర్‌తో వస్తున్న అత్యంత పొదుపుగా ఉన్నాయి. యువతలో డిజిటల్ కనెక్టివిటీని పెంచడంలో మ్యూజిక్ కీలకం అని, దీనిని దృష్టిలో ఉంచుకుని Vi తన ఫ్లాగ్‌షిప్ ప్రీపెయిడ్ ప్లాన్లలో స్పాటిఫై ప్రీమియం యాడ్ చేసింది. వినియోగదారులు ఎలాంటి ప్రకటనల అంతరాయం లేకుండా పాటలు వినడం, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌ చేసుకోవడం, అత్యుత్తమ ఆడియో క్వాలిటీతో ప్రీమియం మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను మరింత సులభంగా పొందే అవకాశం లభిస్తుంది.
 
అధిక డేటా, ఎంటర్‌టైన్మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల కోసం Vi రూ.435 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫ్లాగ్‌షిప్ Vi నాన్‌-స్టాప్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పాటిఫై ప్రీమియం పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో అపరిమిత 4G/5G డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో హాట్‌స్టార్ (మొబైల్) సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. ఎక్కువగా కంటెంట్ చూసే వారికి ఒకే రీఛార్జ్‌తో ప్రీమియం మ్యూజిక్, వినోదం, నిరంతర కనెక్టివిటీని అందిస్తున్న ప్లాన్ గా మారుతుంది. 
 
ప్రీమియం మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను అందరికీ చేరువ చేస్తూ, Vi రూ.250 ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది. 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పాటిఫై ప్రీమియంతో పాటు 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMSలు లభిస్తాయి.
 
అదనపు టాపప్ ప్యాక్ కోరుకునే వినియోగదారుల కోసం రూ.230 ప్యాక్‌ తీసుకొచ్చింది. ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా స్పాటిఫై ప్రీమియంతో పాటు జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్, ఫ్యాన్ కోడ్, లయన్స్ గేట్ ప్లే సహా 20కి పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ ప్యాక్‌లో 30GB హై-స్పీడ్ డేటా పొందుతారు. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు వినియోగదారులు సంబంధిత ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 
 
ఆ తర్వాత Vi యాప్‌లోని యాక్టివ్ సర్వీసెస్ కింద ఉన్న Claim Benefits పేజీకి వెళ్లి, స్పాటిఫై ప్రీమియం పక్కన ఉండే Claimపై క్లిక్ చేయాలి. తరువాత తమ స్పాటిఫై ఖాతాలోకి సైన్ ఇన్ అవ్వడం లేదా కొత్త అకౌంట్ ప్రారంభించడం ద్వారా ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను మీరు వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు.
 
స్పాటిఫై ప్రీమియం బెనిఫిట్ అనేది Vi రీఛార్జ్ వ్యాలిడిటీతో ముడిపడి ఉంటుంది. ప్లాన్ గడువు ముగిసిన తర్వాత తిరిగి తగిన ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లు ప్రకటనలు లేని మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. Vi వినియోగదారులు తమ పాత స్పాటిఫై ఖాతా వివరాలతో లేదా కొత్త ఖాతాను క్రియేట్ చేయడం ద్వారా Vi యాప్ సహాయంతో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. 
 
ఈ సరికొత్త ఆఫర్ ద్వారా Vi ఎంటర్‌టైన్మెంట్‌కు సంబంధించిన సేవలను మరింత బలోపేతం చేసింది. ఇప్పటికే విభిన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ద్వారా నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటి OTT ప్లాట్‌ఫాంలకు Vi యాక్సెస్ ఇస్తోంది. ఇప్పుడు స్పాటిఫై ప్రీమియం సేవలు అందుబాటులోకి రావడంతో వీఐ కస్టమర్లు మరిన్ని సేవలు పొందుతారు. 

Frequently Asked Questions

Vi తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కొత్తగా ఏమి అందిస్తోంది?

Vi 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్‌లతో పాటు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

Vi ప్లాన్‌లతో లభించే స్పాటిఫై ప్రీమియం ప్రయోజనాలు ఏమిటి?

వినియోగదారులు ప్రకటనలు లేని పాటలు వినవచ్చు, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు అత్యుత్తమ ఆడియో క్వాలిటీతో మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇది పూర్తి ప్రీమియం మ్యూజిక్ అనుభవాన్ని అందిస్తుంది.

Vi ప్లాన్‌లలో స్పాటిఫై ప్రీమియంను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

సంబంధిత ప్యాక్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత, Vi యాప్‌లోని 'Claim Benefits' పేజీకి వెళ్లి, స్పాటిఫై ప్రీమియం పక్కన 'Claim'పై క్లిక్ చేయాలి. మీ స్పాటిఫై ఖాతాలోకి సైన్ ఇన్ అవ్వడం లేదా కొత్త ఖాతాను సృష్టించడం ద్వారా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఏ Vi ప్లాన్‌లలో స్పాటిఫై ప్రీమియం అందుబాటులో ఉంది?

Vi రూ.435 మరియు రూ.250 ప్రీపెయిడ్ ప్లాన్‌లు, అలాగే రూ.230 టాపప్ ప్యాక్‌లో స్పాటిఫై ప్రీమియంను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు అధిక డేటా, కాల్స్ మరియు ఇతర వినోద ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget