Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా ఘోరంగా విఫలమైంది. సొంతగడ్డపై టీమ్ ఇండియా ఆలా ఓటమి పాలవడంతో ఫ్యాన్స్ తట్టుకోలేక పొయ్యారు. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై గోరంగా విమర్శలు చేసారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సీనియర్ ప్లేయర్స్, క్రికెట్ నిపుణులు అందరు కూడా గంభీర్ కోచింగ్ స్టైల్ ని విమర్శించారు. సర్రిగే అప్పుడే ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ కూడా సోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
"సొంతగడ్డపై ఎంత దారుణంగా ఓడిపోయాం. రెడ్ బాల్ స్పెషలిస్ట్‌లను ఎంపిక చేయకపోతే ఇదే జరుగుతుంది. ఇప్పుడు భారత్ టెస్ట్ క్రికెట్‌కు రెడ్ బాల్ స్పెషలిస్ట్ కోచ్‌ను నియమించే సమయం వచ్చింది." అని పార్థ్ జిందాల్ ట్వీట్ చేసారు. అయితే ఈ ట్వీట్ గంభీర్ ను ఉదేశించి చేసిందని అందరు అనుకున్నారు. సఫారీలతో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. దాంతో పార్థ్ జిందాల్ కు గంభీర్ ఇండైరెక్ట్ గా ఒక సలహా ఇచ్చాడు.
"క్రికెట్‌కు బయట చాలా మంది ఉన్నారు. జట్టును నిర్మించడానికి ఎంత కృషి, అంకితభావం అవసరమో వారికి అర్థం కాదు. ముఖ్యంగా స్ప్లిట్ కోచింగ్ గురించి మాట్లాడే హక్కు వారికి ఉందని నేను అనుకోను. నేను వారి విషయాలలో జోక్యం చేసుకోకపోతే, వారు నా విషయాలలో జోక్యం చేసుకునే హక్కు లేదు. ఒక ఐపీఎల్ జట్టు యజమాని తన పని తాను చూసుకోవాలి. ఒక కోచ్ తన పని తాను చూసుకోవాలి." అని గంభీర్ మండిపడ్డారు. ఇక వీళ్ల కంట్రోవర్సీ ఎక్కడైఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.





















