Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
Japan earthquake: జపాన్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Tsunami warning issued for Japan after earthquake: జపాన్ తీవ్రమైన భూకంపంతో వణికిపోయింది. దేశం తూర్పు తీరానికి సమీపంలో 7.6 మేర భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు .
అమెరికా జియోలాజికల్ సంస్థ (USGS) ప్రకారం, ఈ భూకంపం జపాన్ సమయం ప్రకారం సోమవారం రాత్రి 11:15 గంటలకు వచ్చింది. జపాన్ తీరానికి సమీపంలో 70 కిలోమీటర్ల దూరంలో, 33 మైళ్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయింది. ఈ భూకంపం కారణంగా దేశం తూర్పు తీరప్రాంతాలు, ముఖ్యంగా ఇవాటె, ఆమోరి వంటి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది.
BREAKING: 7.2-magnitude earthquake hits off northern Japan, tsunami advisory issued - JMA pic.twitter.com/6AGzug4rZp
— BNO News (@BNONews) December 8, 2025
జపాన్ మెట్రలాజికల్సంస్త (JMA) తక్షణమే సునామీ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని తీరప్రాంతాల్లో అలలు దాదాపు 3 మీటర్ల ఎత్తుకు చేరవచ్చని అంచనా. ఈ హెచ్చరిక ప్రకారం, ప్రజలు తీరప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ప్రస్తుతానికి ఎటువంటి మరణాలు లేదా ఆస్తి నష్టాలు నమోదు కాలేదని జపాన్ ప్రభుత్వం చెబుతోంది.
ఈ భూకంపం జపాన్‌లోని 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో జరిగింది, ఇక్కడ భూకంపాలు, సునామీలు సాధారణం.





















