Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
టీ20 ప్రపంచ కప్ 2026 ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇండియా న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో గాయం కారణంగా తిలక్ వర్మ ( Tilak Verma ), వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) తప్పుకున్నారు. అలాగే ఇషాన్ కిషన్ ను టీమ్ లోకి తీసుకొచ్చారు. అయితే ఈ సిరీస్ లో మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనే దానిపై చర్చ మొదలయింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) క్లారిటీ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ వస్తాడని అందరు భావిస్తే, సూర్య మాత్రం మరో ప్లేయర్ పేరును చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మూడవ స్థానంలో ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) బరిలోకి దిగనున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు. దాదాపు 785 రోజుల తర్వాత ఇషాన్ మళ్లీ భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. చివరిసారిగా నవంబర్ 2023లో ఆస్ట్రేలియాపై భారత్ తరఫున ఆడాడు. జార్ఖండ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ) ను కాదని ఇషాన్‌కు ఛాన్స్ ఇవ్వడంపై సూర్యకుమార్ స్పందించాడు. "ఇషాన్ కిషన్ మా వరల్డ్ కప్ ప్లాన్స్‌లో ఉన్నాడు. అతనికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం మా బాధ్యత. అందుకే నంబర్ 3లో ఇషాన్ ఆడతాడు. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఆటగాడు, కానీ ప్రస్తుతం జట్టు అవసరాలకు అనుకూలంగా ఇషాన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాం." అని సూర్య అన్నాడు.





















