MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ లో మ్యాచులు పోటా పోటీగా జరుగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ), ముంబై ఇండియన్స్‌ను ( Mumbai Indians ) ఓడించింది. జెమీమా రోడ్రిగ్స్ ( Jemima Rodrigues ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. హాఫ్ సెంచరీతో చెలరేగి ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచింది.
ఈ టోర్నమెంట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ మరో ఓవర్ ఉండగానే మంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 154 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయ్యారు.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నుంచే దూకుడుగా పరుగులు రాబట్టింది. లిజెల్లీ లీ ( Lizelle Lee ), షఫాలీ వర్మ ( Shafali Verma ) బౌండరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు 63 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ జెమీమా 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.





















