Pakistan Assembly: పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చిన గాడిద - ఆశ్చర్యపోకండి నిజంగానే గాడిద - ఇదిగో వీడియో
Donkey: సీరియస్ గా పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యులు చర్చిస్తున్నారు. ఈ లోపు అంతా గాడిద..గాడిద అని అరుస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారేమో అనుకున్నారు. కానీ నిజంగానే గాడిద వచ్చేసింది.

Donkey Crashes Into Pakistani Assembly Hall Mid Session : పాకిస్తాన్ పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్షసభ్యులు తిట్టుకుంటూ ఉంటారు. గాడిద అని కూడా అరుపులు కేసులు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం నిజంగానే ఓ గాడిద పార్లమెంట్ లోకి వచ్చేసింది.
🚨⚡️ UNUSUAL:
— RussiaNews 🇷🇺 (@mog_russEN) December 5, 2025
"Thrilling Breach" by a Donkey in the Pakistani Parliament Hall Sparks Investigation! 🇵🇰🐴 pic.twitter.com/XaIMdihx2V
పాకిస్తాన్ పార్లమెంట్ సెనెట్ జరుగుతున్న సమయంలో ఒక గాడిద ఆకస్మికంగా లోపలికి వచ్చేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభ్యులు ఆశ్చర్యపోయినా గట్టిగా నవ్వుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది గాడిదను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అది భయంతో కొందరి ఎంపీలపై దాడి చేసింది.
Pakistani Senate sees sudden entry of a unnamed senator in Parliament 😅 pic.twitter.com/pea5ez5m72
— THE UNKNOWN MAN (@Theunk13) December 4, 2025
మొదట గాడిద వచ్చినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది దాన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ, కొన్ని నిమిషాల తర్వాత అది మళ్లీ తిరిగి సభలోకి పరిగెత్తి, కొందరు ఎంపీలను డీకొట్టింది. సెనెట్ చైర్మన్ యూసఫ్ రజా గిలానీ ఈ ఘటనపై హాస్యంగా స్పందిస్తూ గాడిదలు కూడా వాయిస్ ఉండాలని కోరుకుంటున్నాయని సెటైర్ వేసుకున్నారు.
Donkey Enters Pakistan Senate Like a Boss – Netizens: "Finally, a Leader with Real Asim Munir Energy!"
— Mohini Maheshwari (@MohiniWealth) December 5, 2025
Rahul Gandhi Fans Cry: "Even Our LoP Can't Get This Grand an Entry!" 😂🐴 pic.twitter.com/CKMb6tavRr
పార్లమెంట్ హౌస్ సర్వీస్ కారిడార్ భద్రత లోపంతో దగ్గరలో ఉన్న స్టేబుల్స్ నుంచి గాడిద లోపలికి చొరబడిందని గుర్తించారు. ఈ ఘటన పాకిస్తాన్ పార్లమెంట్ పై నెటిజన్లు జోకులు వేయడానికి బాగా ఉపయోగపడుతోంది.





















