Skin Care Tips : చర్మ సంరక్షణ చిట్కాలు.. నిద్రలోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసే Skincare Secrets
Night Skincare Routine : నిద్రలో చర్మం రిపేర్, హైడ్రేట్, పునరుద్ధరణ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ బేసిక్స్ ఫాలో అవ్వండి. స్కిన్ హెల్తీగా మారుతుంది.

Simple Night Skincare : నిద్రపోతున్నప్పుడు చర్మం తన పనిని బాగా చేస్తుంది. సూర్యరశ్మి, కాలుష్యం, పగటి ఒత్తిడితో పోరాడి.. రాత్రిపూట స్కిన్ రికవరీ అవుతుంది. రాత్రిపూట చర్మ సంరక్షణను పర్యావరణ కారకాలకు వ్యతిరేకంగా కాకుండా.. మీ చర్మంతో కలిసి పనిచేసేదిగా ఫీల్ అవ్వాలి. విశ్రాంతి సమయంలో శరీర మరమ్మత్తు ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ సమయంలో చర్మంలో కణ విభజన, DNA మరమ్మత్తు పెరుగుతుంది. సన్‌స్క్రీన్, మేకప్ లేయర్‌లు లేనప్పుడు.. చర్మ పొరలలోకి క్రియాశీల పదార్థాలు మెరుగ్గా చేరతాయి. అక్కడ అవి ఉత్తమంగా పనిచేస్తాయి.
శుభ్రతే ముఖ్యం
సరైన శుభ్రత తర్వాత వచ్చే అన్నింటికీ పునాది వేస్తుంది. డబుల్-క్లెన్స్ పద్ధతి.. అంటే సన్‌స్క్రీన్, మేకప్‌ను తొలగించడానికి ఆయిల్ లేదా బామ్ క్లీనర్‌ను ఉపయోగించడం, ఆపై సాధారణ ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవడం. ఇది మీ చర్మం పూర్తిగా శుభ్రంగా ఉందని నిర్ధారిస్తుంది. ఇది రంధ్రాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది. చికిత్స ఉత్పత్తులు తమ పనిని చేయడానికి సహాయపడుతుంది.
చర్మ సంరక్షణకై..
మార్కెట్లో లక్షలాది క్రియాశీల పదార్థాలు, ఉత్పత్తులు ఉండవచ్చు. కానీ మీ చర్మ రకం, సమస్యలకు సంబంధించినవి, దశాబ్దాల పరిశోధనల మద్దతు ఉన్నవాటిని ఎంచుకోవడం ముఖ్యం. గణనీయమైన పరిశోధన మద్దతు ఉన్న పదార్థాల విషయానికి వస్తే.. రెటినాయిడ్స్ ముందుంటాయి. విటమిన్ ఎ, ఈ ఉండేవి చర్మ సంరక్షణకు హెల్ప్ చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. కణాల మార్పును వేగవంతం చేస్తాయి. ఫోటోడామేజ్‌ను మరమ్మత్తు చేస్తాయి. అదే సమయంలో గ్లైకోలిక్ యాసిడ్ వంటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ రసాయన ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తాయి.
లాక్ చేయండి
రాత్రిపూట మాయిశ్చరైజర్ హైడ్రేషన్ కంటే ఎక్కువ చేయాలి. చర్మం రక్షిత అవరోధాన్ని బలోపేతం చేసే సిరామైడ్స్ కోసం చూడండి. పెట్రోలేటం వంటి అక్లూసివ్ పదార్థాలు రాత్రిపూట అన్నింటినీ సీల్ చేస్తాయి. పైన మేకప్ లేదా సన్‌స్క్రీన్ అవసరం లేకుండా రాత్రిపూట హైడ్రేషన్ కోసం రిచ్ టెక్స్‌చర్‌లు ఆచరణాత్మక ఎంపికలుగా మారతాయి.
ఫేషియల్ మసాజ్
దంతాలు కొరకడం లేదా ఒక వైపు నిద్రపోవడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ కణజాలంలో ఒత్తిడిని కలిగిస్తాయి. ఫేషియల్ మసాజ్ ఈ సమయంలో స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. సరిగ్గా, రెగ్యులర్గా చేస్తే.. ఇది మైక్రోసర్క్యులేషన్‌ను పెంచుతుంది. కాలక్రమేణా కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మ ఉత్పత్తులను బాగా గ్రహిస్తుంది. కాలక్రమేణా చర్మాన్ని మరింత బిగుతుగా కనిపించేలా చేయడంలో కూడా సహాయపడుతుంది.
సింపుల్ కేర్
రాత్రిపూట చర్మ సంరక్షణకు డజన్ల కొద్దీ ఉత్పత్తులు లేదా గంటల తరబడి దినచర్య అవసరం లేదు. సరళమైన, స్థిరమైన రొటీన్ బెస్ట్. చర్మ కణాల మార్పుకు సమయం పడుతుంది కాబట్టి.. ఫలితాలను చూడటానికి తగినంత కాలం (సాధారణంగా 8-12 వారాలు) కట్టుబడి ఉండాలి. దీనికి ఓపిక, నిజంగా పనిచేసే పదార్థాలపై దృష్టి పెట్టడం అవసరం. సరైనవి ఎంచుకుంటే.. అద్దంలో దాని ఫలితాలు కనిపిస్తాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















