అన్వేషించండి

Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు

Visakha Utsav: ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా విశాఖ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. టూరిజానికి ఈ ఉత్సవ్ బూస్ట్ ఇవ్వనుంది.

Visakha Utsav Arrangements:  ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఏడాది విశాఖ ఉత్సవ్ ను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.  సాగరం నుంచి శిఖరం వరకు  అనే ప్రత్యేక థీమ్‌తో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.                                

ఈసారి ఉత్సవాలను కేవలం విశాఖ నగరానికే పరిమితం చేయకుండా, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కూడా విస్తరించడం విశేషం. మూడు జిల్లాల వ్యాప్తంగా మొత్తం 20 ప్రధాన వేదికలపై 500కు పైగా సాంస్కృతిక, పర్యాటక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. విశాఖపట్నంలో ప్రారంభ వేడుకలు ఘనంగా మొదలై, ఫిబ్రవరి 1న అనకాపల్లిలో ముగింపు వేడుకలతో ఈ సంబరాలు ముగుస్తాయి. తీరప్రాంత పర్యాటకం నుంచి మన్యం ప్రాంతపు గిరిజన సంస్కృతి వరకు ప్రతి అంశాన్ని ఈ వేదికలపై ప్రదర్శించనున్నారు.             

ఈ మెగా ఈవెంట్ ద్వారా సుమారు రూ. 500 కోట్ల మేర ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, అలాగే సుమారు 3000 మంది స్థానిక కళాకారులు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు రుషికొండ, సాగర్‌నగర్, భీమిలి బీచ్‌లలో డ్రోన్ షోలు, బీచ్ స్పోర్ట్స్, ఫ్లవర్ షో, మిస్ వైజాగ్ వంటి పోటీలు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. అరకు, లంబసింగి వంటి ప్రాంతాలలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, హస్తకళల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.                                         

పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక వంటకాలు  , చేనేత వస్త్రాలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.                  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu Adulteration: తిరుమల లడ్డూ కల్తీ అని 4 నివేదికలు! అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ఛాలెంజ్!
తిరుమల లడ్డూ కల్తీ అని 4 నివేదికలు! అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ఛాలెంజ్!
AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు
ఏపీలో స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు
Vishnu Manchu : విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
Rhea Chakraborty : నాతో వర్క్ చేసేందుకు ఎవరూ ఇష్టపడలేదు - కెరీర్ క్లోజ్ అనుకున్నా... రీ ఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్
నాతో వర్క్ చేసేందుకు ఎవరూ ఇష్టపడలేదు - కెరీర్ క్లోజ్ అనుకున్నా... రీ ఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Naga Vamsi about Vishwak Sen | విశ్వక్ పై నాగవంశీ కామెంట్స్ | ABP Desam
T20 World Cup India vs Pakistan | ఫిబ్రవరి 15న భారత్ - పాక్ మ్యాచ్
Gambhir Master Plan T20WC Ind vs USA | భారత్ విజయం వెనుక గంభీర్ మాస్టర్ ప్లాన్
Mohammed Siraj unexpected entry in India vs US T20WC | వరల్డ్ కప్‌లో మియా భాయ్ మేజిక్
T20 World Cup India vs USA | అమెరికాపై టీమిండియా ఘన విజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Adulteration: తిరుమల లడ్డూ కల్తీ అని 4 నివేదికలు! అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ఛాలెంజ్!
తిరుమల లడ్డూ కల్తీ అని 4 నివేదికలు! అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ఛాలెంజ్!
AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు
ఏపీలో స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు
Vishnu Manchu : విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
Rhea Chakraborty : నాతో వర్క్ చేసేందుకు ఎవరూ ఇష్టపడలేదు - కెరీర్ క్లోజ్ అనుకున్నా... రీ ఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్
నాతో వర్క్ చేసేందుకు ఎవరూ ఇష్టపడలేదు - కెరీర్ క్లోజ్ అనుకున్నా... రీ ఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్
Forensic Science Lab Fire Update: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. ఆధారాలపై అదంతా దుష్ప్రచారమే: శిఖా గోయల్ క్లారిటీ
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. ఆధారాలపై అదంతా దుష్ప్రచారమే: శిఖా గోయల్ క్లారిటీ
Jeffrey Epstein Web Series : ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం - ఆరేళ్ల తర్వాత వెబ్ సిరీస్ ట్రెండింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం - ఆరేళ్ల తర్వాత వెబ్ సిరీస్ ట్రెండింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ramayana Movie : 'రామాయణ'లో యంగ్ హీరో - తన ప్లేస్‌లో అంటూ ప్రచారం... '12th ఫెయిల్' హీరో క్లారిటీ
'రామాయణ'లో యంగ్ హీరో - తన ప్లేస్‌లో అంటూ ప్రచారం... '12th ఫెయిల్' హీరో క్లారిటీ
8th Pay Commission website: జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. మార్చి 16 వరకు అవకాశం
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 16 వరకు అవకాశం
Embed widget