DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్ 2026 సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగవని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించడం అనేది కర్ణాటక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయాన్ని అంగీకరించం. నేను కూడా క్రికెట్ అభిమానిని. స్టేడియం ప్రతిష్ఠను కాపాడతాం. ఇకపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ 2025 టైటిల్ ను సొంతం చేసుకున్న RCB.. చిన్నస్వామి స్టేడియం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్ ను ప్లాన్ చేసారు. అప్పుడు చోటు చేసుకున్న సంఘటన గురించి తెలిసిందే. దాంతో భద్రతా కారణాల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌లు వేరే వేదికలకు మార్చే అవకాశం ఉందనే వార్తలు రావడంతో శివకుమార్ స్పందించారు.





















