Made In Korea OTT : ఓటీటీలోకి ఓజీ బ్యూటీ మేడ్ ఇన్ కొరియా - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Made In Korea OTT Platform : ఓజీ బ్యూటీ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండో కొరియన్ డ్రామా మేడ్ ఇన్ కొరియా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Priyanka Mohan's Made In Korea OTT Streaming : రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీలో తన అందం, యాక్టింగ్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇండో కొరియన్ డ్రామా మేడ్ ఇన్ కొరియా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి రా కార్తీక్ దర్శకత్వం వహించగా... శ్రీనిధి సాగర్ నిర్మించారు.
View this post on Instagram
Also Read : దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
స్టోరీ ఏంటంటే?
తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయికి చిన్నప్పటి నుంచీ కొరియా వెళ్లాలని కల. అందుకోసం చిన్నప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తుంది. చివరకు అతి కష్టం మీద దక్షిణ కొరియా చేరుకుంటుంది. అసలు ఆమె కొరియా వెళ్లాలని ఎందుకు అనుకుంది? అక్కడకు వెళ్లే క్రమంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులేంటి? దక్షిణ కొరియాలో ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరకు ఇండియాకు తిరిగి వచ్చిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















