MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
సోషల్ మీడియా ప్రభావంపై ఎంపీ సుధామూర్తి రాజ్య సభలో మాట్లాడారు. సోషల్ మీడియా కత్తి లాంటిదన్న సుధా మూర్తి దానితో పండ్లు కోసుకోవచ్చూ లేదంటే మర్డర్ చేయొచ్చూ అని విచక్షణ ఉండాలంటూ ప్రసంగించారు.
"నా దృష్టిలో సోషల్ మీడియా అంటే కత్తి లాంటి పదునైన ఆయుధం. దాంతో మనం పండ్లు కోసుకోవచ్చు..లేదా ఓ మనిషిని హత్య చేయొచ్చు. మన అభ్యున్నతి కోసం సోషల్ మీడియాను వాడుకోవచ్చు కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు..పిల్లలు ఇన్ఫ్లుయెన్సర్లే..తల్లీ ఇన్ఫ్లుయెన్సరే..చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తారు. కానీ ఎవరిపైనా నియంత్రణ అనేది కనిపించటం లేదు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై ఓ నియంత్రణా వ్యవస్థ కావాలి. మన ప్రభుత్వం ఇప్పటికే చాలా గొప్పగా పనిచేస్తోంది. పిల్లలు ఏదైనా సినిమాల్లో నటిస్తున్నా..యాడ్స్ లో నటిస్తున్నా..వాళ్ల హక్కుల పరిరక్షణ కోసం మంచి మంచి చట్టాలు చేశారు. కానీ సోషల్ మీడియా విషయంలో అలా జరగటం లేదు. ఫలితంగా అనేక సమస్యలు భవిష్యత్తులో మన పిల్లలకు ఎదురుకావొచ్చు. తల్లితండ్రులకు కూడా మనం చెప్పగలగాలి..పిల్లలకు కొన్ని రకాల బట్టలు వేయకూడదని...వాళ్లను కొన్ని రకాల పాటలకు డ్యాన్సులు చేయించకూడదని..ప్రత్యేకించి సోషల్ మీడియా విషయంలో మాత్రం కచ్చితంగా నియంత్రణ ఉండాలి.' - సుధామూర్తి, ఎంపీ, రాజ్యసభ





















