Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో వైట్‌వాష్ అయిన ఇండియా క్రికెట్ టీమ్... వన్డే సిరీస్ లో మంచి ప్రదర్శనతో అక్కటుకుంది. ఇందుకు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కూడా ఒక రీజన్ అనే చెప్పాలి. రెండు సెంచరీస్.. మూడవ వన్డే లో అర్ధసెంచరీతో 302 రన్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. అటు మరో సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కూడా సత్తా చాటాడు.
ఈ సిరీస్ కన్నా ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో హిట్‌మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి సంబంధించి ఎదో ఒక విషయంపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ట్రోల్స్ ఎదుర్కుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి జోడీపై ప్రశంసలు కురిపించాడు.
‘రోహిత్, విరాట్ కేవలం స్కిల్ల్డ్ ప్లేయర్స్ మాత్రమే కాదు.. వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ క్లాస్ క్రికెటర్స్. వారి అనుభవం డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తాము ఎలా ఆడితే జట్టుకు ప్రయోజనమో వారికి తెలుసు. కొన్నేళ్లుగా భారత క్రికెట్ తరఫున అలాంటి ప్రదర్శననే కొనసాగిస్తున్నారు. ముందు కూడా ఇదే జోరును చూపాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు కోచ్ గౌతమ్ గంభీర్. అయితే గంభీర్ మాటలు విని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.





















