అన్వేషించండి

RRB RPF Constable Answer Key: ఆర్‌పీఎఫ్‌ ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం

RRB RPF Answer Key: RPF: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పరీక్ష ఆన్సర్ కీ విడుదలైంది. మార్చి 24 నుంచి 29 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు.

RRB RPF Constable Answer Key 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌) పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేపింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా పొందుపరిచింది. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మార్చి 24 నుంచి 29 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లింక్ ద్వారా అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల నమోదుచేయవచ్చు. అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి కీ పై అభ్యంతరాలను తెలపవచ్చని, సరైనదని తేలీతే తిరిగి రీఫండ్‌ చేయబడతుందని రైల్వే శాఖ తెలిపింది.

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌లో మొత్తం 4,660 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 452 సబ్ ఇన్‌స్పెక్టర్(SI), 4208 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. మార్చి 2 నుంచి 18 వరకు ఆర్‌పీఎఫ్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 

ఆర్‌పీఎఫ్‌ ప్రాథమిక కీ, అభ్యంతరాల కోసం క్లిక్ చేయండి.. 

రాతపరీక్ష విధానం..
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, అరిథ్‌మెటిక్ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.

ఆర్‌పీఎఫ్ పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్): రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ కింది విధంగా ఉంటుంది.

విభాగం 1600 మీటర్ల పరుగు 800 మీటర్ల పరుగు  లాంగ్  జంప్ హైజంప్
ఎస్‌ఐ (మెన్) 6.30 నిమిషాలు  - 12 ఫీట్లు 3 ఫీట్ల 9 అంగుళాలు 
ఎస్‌ఐ (ఉమెన్) - 4 నిమిషాలు 9 ఫీట్లు 3 ఫీట్లు

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT):

ఆర్‌పీఎఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
విభాగం ఎత్తు (సెం.మీ.లలో ) ఛాతీ (సెం.మీ.లలో ){పురుషులకు మాత్రమే}
జనరల్/ఓబీసీ   165 157 80 85
ఎస్సీ/ఎస్టీ 160 152 76.2 81.2
గర్వాలీలు, గూర్ఖాలు, మరాఠాలు, డోగ్రాలు, కుమాయోనీస్ మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర కేటగిరీలకు చెందినవారికి 163 155 80 85

డాక్యుమెంట్ వెరిఫికేషన్: 
అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా సరైన అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నవారికి ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - NOC) తీసుకోవాల్సి ఉంటుంది.

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Embed widget