అన్వేషించండి

Chandra Babu And Jagan: జగన్, చంద్రబాబు పోటాపోటీ ఇఫ్తార్ విందులు! పవన్ కల్యాణ్ అటెండ్ అవుతారా?

Andhra Pradesh News: మార్చి 26న వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ఇఫ్తార్ విందుకు జగన్ రానున్నారు. ఆ తర్వాత రోజు జరిగే ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరి పవన్ కల్యాణ్ హాజరవుతారా?

Andhra Pradesh News: రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు చాలానే చూస్తుంటాం. ప్రైవేటు వ్యక్తులే కాదు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ ముస్లింలకు విందులు ఇస్తుంటాయి. ఇంత వరకు బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందులో కూడా రాజకీయం జొరబడింది. అందుకే పోటాపోటీ విందులు సిద్ధమవుతున్నాయి. 

ఏపీలో రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులకు రెడీ అవుతున్నాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26న అంటే బుధవారం ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అందులో ఆయన కూడా పాల్గొంటున్నారు. గతేడాది ముఖ్యమంత్రి హోదాలో కదిరిలో నిర్వహించిన ఇఫ్తార్ విందు అటెండ్ అయిన జగన్ మెహన్ రెడ్డి ఈ ఏడాది విజయవాడలో పార్టీ నాయకులు ఇచ్చే ఇఫ్తార్‌కు అటెండ్ కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైసిపి ముస్లిం మైనారిటీ నాయకులు చేస్తున్నారు 

27న ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్
ఏపీ ప్రభుత్వం ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇఫ్తార్ విందు ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీని కోసం కోటిన్నర రూపాయల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఇక విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఇఫ్తారు విందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటెండ్ కాబోతున్నారు. దీనికి ఆయనతోపాటు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరుకాబోతున్నారు. 

అన్ని జిల్లాల కేంద్రాల్లో అదే రోజు జరిగే ఇఫ్తార్‌లో ఆహార పదార్థాలకు ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. 27 ఉదయం పోలవరం టూర్‌కి వెళ్లి సాయంత్రానికి తిరిగిరానున్నారు చంద్రబాబు. అనంతరం విజయవాడలో ఇఫ్తార్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు. 

ఇఫ్తార్‌లో పవన్ పాల్గొంటారా?
అయితే ఇప్పుడు రాష్ట్రంలోని అందరి దృష్టి ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఉంది. గతంలో ఆయన ఇఫ్తార్ విందులకు హాజరైన చరిత్ర ఉన్నా ఇటీవల కాలంలో పూర్తిగా సనాతన ధర్మం వైపు టర్న్ తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 27న జరిగే ఇఫ్తార్‌కు అటెండ్ అవుతారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే సనాతన ధర్మం దీక్ష తీసుకున్నా ఇతర ధర్మాల పట్ల తనకు గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ చెబుతారు. కాబట్టి ఆయన సరైన నిర్ణయమే తీసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

 

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget