అన్వేషించండి

Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

మెగా డీఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి సభలో కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఇంకా వైసీపీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే పట్టుకొని సభకు రావాలని సవాల్ చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై విస్తృత చర్చ జరిగింది.
  • డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
  • అక్రమాలకు ఆధారాలుంటే అసెంబ్లీలో సమర్పించాలని వైసీపీకి సవాల్ చేశారు.
  • నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమని ప్రభుత్వం హెచ్చరించింది.

Chandra Babu About Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై కీలకమైన చర్చ జరిగింది. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రోడ్లపై నిరసనలు తెలియజేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. అయినా తమ ఆరోపణలను మాత్రం వారు ఆపడం లేదు. దీంతో అసెంబ్లీలోనే చర్చ పెట్టి పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే అసెంబ్లీలో విస్తృతంగా చర్చ సాగింది. ఇందులో మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి వైసీపీ తీరును తప్పుపట్టారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపించకుండా కేవలం బురద జల్లుతున్నారని, అపోహలు సృష్టించడమే వారి పని అని అంటూ మండిపడ్డారు. సాక్ష్యాలు ఉంటే పట్టుకొని సభకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఈ ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదని అలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అదే టైంలో జరగని తప్పులు గురించి ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేసిన వారి కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

ఎలాంటి తప్పులు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే మెగా డీఎస్సీ 2025 నియామకాలు పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ విషయం రాసిన అభ్యర్థులకు, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు తెలుసునని అన్నారు. అందుకే వైసీపీ ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నా పట్టించుకున్న వారు లేరని అభిప్రాయపడ్డారు. 

కేవలం వైసీపీ నేతలు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నానాయాగి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సాక్ష్యాలతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలకు స్పోర్ట్స్‌కు గేమ్స్‌కు తేడా తెలియదన్నారు. అందుకే ఏదో జరిగిపోయిందనే భ్రమల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారులతోపాటు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కూడా రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారని, వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. 

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు చంద్రబాబు. వారు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ ఉద్యోగాల నోటఫికేషన్ వేయలేకపోయామనే కోపంతోనే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చామని, 108 రోజుల్లోనే ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఇందులో భాగమైన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ఇంత పకడ్బంధీగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినప్పటికీ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. నిజంగా వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వాటిని టేబుల్‌పై పెట్టాలని సవాల్ చేశారు. రోడ్డుపై నిలబడి ఏవో కాగితాలు చూపించి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. 

తమ ప్రభుత్వంలో తప్పుల చేసేందుకు ఆస్కారం లేదని అలాంటి తప్పులు ఉన్నట్టు నిరూపిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. అదే టైంలో సాక్ష్యాలు లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పులు జరిగి ఉంటే చర్యలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినా చర్యలు ఉంటాయని వైసీపీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక డీఎస్సీపై క్లియర్‌గా అన్ని వివరాలు చెప్పేశామని, ఇకపై దీని గురించి చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.    

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై ప్రధాన చర్చ ఏమిటి?

మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ఆరోపణలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.

మెగా డీఎస్సీ 2025 అక్రమాల ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి ఏమిటి?

నియామకాలు ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమాలు జరగడానికి ఆస్కారం లేదని తెలిపారు.

వైసీపీ ఆరోపణలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎలాంటి సవాల్ చేశారు?

అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి టేబుల్‌పై పెట్టాలని సీఎం సవాల్ చేశారు. సాక్ష్యాలు లేకుండా చేసే ఆరోపణలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget