Afg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP Desam
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పెను సంచలనం నమోదైంది. అదేంటంటే ఇంగ్లండ్ ను ఇంటికి పంపించేసింది ఆఫ్గనిస్థాన్. అసలే ఆస్ట్రేలియాతో మీద ఓడి ఆఫ్గాన్ మీద భారీ విక్టరీ కొడదాం లే అన్న కసితో ఉన్న ఇంగ్లండ్ ను...ఊహించని ఓటమితో కోలుకోలేని దెబ్బ తీసింది కాబూలీ టీమ్. ఆఫ్గాన్ కొట్టిన దెబ్బకు లీగ్ స్టేజ్ లోనే ఇంగ్లండ్ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. ఇది ఇప్పుడే కాదు 2023 వన్డే వరల్డ్ కప్పులోనూ ఇంగ్లండ్ కి ఇలానే షాక్ ఇచ్చింది అఫ్గాన్ . అప్పుడు కూడా ఇంతే సెమీస్ కి వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆఫ్గాన్ చేతిలో ఓటమి పాలై ఇంటిదారి పట్టింది ఇంగ్లండ్. పోనీ ఆఫ్గానే వీళ్లపై విరుచుకుపడుతుందా అంటే లేదు. 2011వరల్డ్ కప్. ఇండియా కైవసం చేసుకున్న ఈ వరల్డ్ కప్ లో ఐర్లాండ్ ఇంగ్లండ్ కి షాక్ ఇచ్చింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది ఇంగ్లండ్. అప్పుడే కెవిన్ ఓబ్రియాన్ భారీ సెంచరీతో ఇంగ్లండ్ కు చుక్కలు చూపించాడు. అలా కీలకమైన మ్యాచుల్లో పైగా ఐసీసీ టోర్నీల్లో ఇలా చిన్న జట్ల చేతిలో షాక్ తినాలని రూల్ పెట్టుకుని వస్తుందేమో మరి ఇంగ్లండ్.





















