Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ), న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20లో ( India vs New Zealand ) 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. యువరాజ్ సింగ్ పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున సిక్సర్లు కొట్టడంలో యువరాజ్ సింగ్‌ను అధిగమించాడు.
అభిషేక్ చాలా తక్కువ ఇన్నింగ్స్‌లలోనే యువరాజ్ ( Yuvraj Singh ) ను అధిగమించాడు. యువీ 51 ఇన్నింగ్స్‌లలో 74 టీ20 ఇంటర్నేషనల్ సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ 33 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డు బ్రేక్ చేశాడు. అభిషేక్ తన మెంటార్ అయిన యువరాజ్ సింగ్ కంటే 18 ఇన్నింగ్స్‌ల ముందే ఈ ఫీట్ చేరుకున్నాడు. మొదటి టీ20లో అభిషేక్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు.
అభిషేక్‌ను 2026 టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియాలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టోర్నమెంట్‌లో అభిమానుల దృష్టి అభిషేక్‌పైనే ఉంటుంది. అతను ఫామ్ లో ఉండడం టీమ్ కు చాలా అవసరం. ఈ మ్యాచ్ లో చెలరేగిన అభిషేక్, వరల్డ్ కప్ లో కూడా ఇదే ప్రదర్శన కనబర్చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.





















