అన్వేషించండి

Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు

Andhra Pradesh News | పోలవరం జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతంలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

రంపచోడవరం మన్యం ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గంగవరం మండలం మొల్లవరం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించగా, అడ్డతీగల మండలం తిమ్మాపురం సమీపంలో రాత్రి సమయంలో పులి కనిపించినట్లు తెలుస్తోంది. తమ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో మన్యం గ్రామాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. 

పులి కదలికలను నిశితంగా గమనించేందుకు అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగాయి. పులి యొక్క పాదముద్రలను (Pugmarks) సేకరించి, అది ఏ దిశగా వెళ్తుందో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ పులి మెడలో రేడియో కాలర్ అమర్చి ఉండటం అధికారులకు కలిసివచ్చే అంశం. దీని ద్వారా పులి ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది, దాని కదలికలు ఎలా ఉన్నాయి అనే సమాచారాన్ని శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా అటవీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి మెడలోని రేడియో కాలర్ ద్వారా పులి జాడ కనిపెట్టాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తగా అధికారులు గోకవరం, జగ్గంపేట,  ఏలేశ్వరం మండలాల పరిధిలోని గ్రామాలకు అప్రమత్తత సందేశాలు పంపారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లవద్దని, ఒంటరిగా అడవి ప్రాంతాలకు వెళ్లరాదని ప్రజలకు సూచించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరుతూ మన్యం ప్రాంత వాసులకు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Vasamsetti Subhash : మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాఖాలో తండ్రి పెత్త‌నం! టీడీపీకి న‌ష్టం జరుగుతోందని కేడర్‌ అసహనం!
Dindi - Chinchinada Bridge: నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
నెల‌లు దాటినా పూర్తికాని దిండి- చించినాడ వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు! ఇబ్బందులు పడుతున్న జనం!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS RR Result Update: రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Embed widget