అన్వేషించండి

Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం

హైదరాబాద్: త్వరలో  నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద కృష్ణా నదిపై నిర్మించాలని చూస్తున్న ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ వంతెన ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక అడ్డంకి తొలగిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన సుమారు 60 ఎకరాల (24.66 హెక్టార్లు) అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-167కే విస్తరణలో భాగంగా ఈ భూమి వినియోగానికి సంబంధించి ఫిబ్రవరి చివరి వారంలో చెన్నైలో జరిగిన ప్రాంతీయ స్థాయి సమావేశంలో స్టేజ్-1 అనుమతులు మంజూరయ్యాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ, కృష్ణా నదిపై దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ కేబుల్ స్టేడ్ (ఐకానిక్) బ్రిడ్జిని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం పూర్తయితే, హైదరాబాద్ - తిరుపతి మధ్య ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఇది ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపిరి పోస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రకృతి సౌందర్యంలో ఆకట్టుకుంటున్న సోమశిల..

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో ఉన్న సోమశిల, ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మికతకు నెలవైన ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. కృష్ణా నది ఒడ్డున వెలసిన ఈ గ్రామం, చుట్టూ దట్టమైన నల్లమల అడవులు, కొండలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడ ప్రాచీనమైన లలిత సోమేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి. ఈ ఆలయంలోని ప్రతిష్టించిన లింగాలు, శిల్పకళా చాతుర్యం పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ (నీటి నిల్వ) కారణంగా ఇక్కడ నది సముద్రంలా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్మించిన కాటేజీలు, బోటింగ్ సౌకర్యాలు ఈ ప్రాంతాన్ని ఒక వీకెండ్ పిక్నిక్ స్పాట్‌గా మార్చాయి.

(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్‌ కోసం రిఫ్రెష్ చేయండి)

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget