అన్వేషించండి

Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?

Bigg Boss Thanuja Puttaswamy: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9తో పాపులరైన కన్నడ అమ్మాయి, సీనియర్ నటి తనూజ పుట్టస్వామి. తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో గట్టిగా ఇచ్చిపడేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బిగ్‌బాస్ తనూజ, సోషల్ మీడియా ట్రోల్స్‌పై తీవ్రంగా స్పందించింది.
  • పవన్ సాయి, కళ్యాణ్ పడాల గురించి వదంతులు ఖండించింది.
  • కళ్యాణ్ సహాయానికి పవన్ సాయి చొరవను స్పష్టం చేసింది.
  • ట్రోలర్స్ పనీపాట లేనివారు, వ్యక్తిగత జీవితంపై మాట్లాడొద్దంది.

'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో సీజన్ 9 ద్వారా పాపులరైన కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇటీవల కాలంలో తన మీద సోషల్ మీడియాలో ఎక్కువైన విమర్శలు, ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు. 'బిగ్ బాస్ 9'లో తనూజ రన్నరప్‌గా నిలిచి సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా తనూజ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేలా కామెంట్లు వస్తున్నాయి. వాటిపై ఆవిడ మౌనం వీడారు. ట్రోలర్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

మేమంతా బాగున్నాం... కానీ మీరే!
తనూజాకు వ్యతిరేకంగా 'ముద్ద మందారం' (MM) టీమ్ సభ్యులు చాలా కుట్రలు పన్నారని... కళ్యాణ్ పడాల వచ్చిన తర్వాత పవన్ సాయిని ఆమె పూర్తిగా దూరం పెట్టారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. వాటిపై స్పందిస్తూ... ''బిగ్ బాస్ షో ముగిసి ఏడు నెలలు దాటినప్పటికీ ఇంకా దాని గురించే మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉంది. షోలో పోటీ, గొడవలు ఉండవచ్చు, కానీ బయటకు వచ్చాక మేమంతా బాగున్నాం. ఒకరి సంతోషాలను, బాధలను మరొకరం పంచుకుంటున్నాం. మాకు లేని బాధ మీకెందుకు?" అని తనూజ సూటిగా ప్రశ్నించారు.

Also Read: Chennai Love Story Collections - చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్లు... కిరణ్ అబ్బవరం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

కళ్యాణ్ పడాలకు ఒకానొక సమయంలో సమస్య ఎదురైతే... ఆ విషయంలో తనూజ పుట్టసామి సహాయం చేశారు. ఆ విషయం గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ''ఆ సమయంలో కళ్యాణ్ కు సహాయం చేయడానికి నేను పవన్ సాయి (PS)కే ఫోన్ చేశా. పవన్ సాయి కూడా ఎంతో చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించడంలో చాలా సాయం చేశారు'' అని తనూజ తెలిపారు. తన కుటుంబానికి కళ్యాణ్ పడాల బాగా తెలుసు అని, తమ మధ్య మంచి బాండింగ్ ఉందని స్పష్టం చేశారామె. పవన్ సాయి, హరితమ్మ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారని... వాళ్ళను అనవసరంగా వివాదాల్లోకి లాగవద్దని తనూజ రిక్వెస్ట్ చేశారు.

Also ReadJana Nayagan Box Office Collection Day 2 - 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్!

నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళకు పనీ పాట లేదని... ఖాళీగా ఉంటే ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేసుకోవాలని తనూజ ఎద్దేవా చేశారు. అభిమానులకు ఓ విన్నపం చేశారు. ''సోషల్ మీడియాలో నా మీద వచ్చే నెగిటివ్ పోస్ట్‌లను నాకు పంపించవద్దు. అవి చూసి నేను డిస్టర్బ్ అవుతాను'' అని అభిమానులకు తనూజ చెప్పారు. ప్రతి ఒక్కరినీ గౌరవించాలని, వ్యక్తులపై ద్వేషాన్ని పెంచకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ట్రోలర్లపై తనూజ ఫైర్ అయ్యారు.

Also ReadPawan Kalyan Vs Vijay - పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?

Frequently Asked Questions

తనూజ పుట్టస్వామి ఎవరు?

తనూజ పుట్టస్వామి కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్. ఆమె 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో సీజన్ 9 ద్వారా బాగా పాపులర్ అయ్యారు, అందులో రన్నరప్‌గా నిలిచారు.

సోషల్ మీడియా విమర్శలపై తనూజ ఎందుకు స్పందించారు?

ఇటీవల తన క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువైన విమర్శలు, ట్రోల్స్‌పై ఆమె ఘాటుగా స్పందించారు. 'ముద్ద మందారం' టీమ్, కళ్యాణ్ పడాల, పవన్ సాయి గురించి వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

కళ్యాణ్ పడాల, పవన్ సాయిల గురించి తనూజ ఏమి వివరణ ఇచ్చారు?

కళ్యాణ్ కు సహాయం చేయడానికి పవన్ సాయికి ఫోన్ చేశానని, ఆయన సాయం చేశారని తెలిపారు. తమ కుటుంబానికి కళ్యాణ్ పడాల తెలుసని, పవన్ సాయి, హరితమ్మలను వివాదాల్లోకి లాగవద్దని ఆమె కోరారు.

ట్రోలర్లకు తనూజ పుట్టస్వామి ఇచ్చిన సలహా ఏమిటి?

నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్లకు పనీ పాట లేదని, ఖాళీగా ఉంటే ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యక్తులపై ద్వేషాన్ని పెంచకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget