అన్వేషించండి

Sampradayini Suppini Suddapoosani Review - 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' రివ్యూ: శివాజీ, లయ లేటెస్ట్ సినిమా - క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?

Sampradayini Suppini Suddapoosani Review Telugu: శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి. 

Sivaji Laya latest movie Sampradayini Suppini Suddapoosani review: శివాజీ, లయది హిట్ పెయిర్. 'మిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా' సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'కోర్ట్', 'దండోరా'తో రీ ఎంట్రీలో నటుడిగా ప్రశంసలతో పాటు విజయాలను అందుకున్నారు శివాజీ. ఇప్పుడు ఆయనకు జంటగా లయ నటించిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. మొదట ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, తర్వాత థియేటర్లకు తీసుకు వచ్చారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?

కథ (Sampradayini Suppini Suddapoosani Story): శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ రాజ్ సెక్రటరీ. చాలా నిజాయితీపరుడు. చిత్తూరు జిల్లాలోని సొంతూరులో పోస్టింగ్ కావడంతో ఎవరికీ భయపడడు. ఓసారి ఎస్సై విక్రమ్ (ప్రిన్స్)తో రోడ్డు మీద గొడవ అవుతుంది. 

శ్రీరామ్‌తో గొడవ తర్వాత ఆయన ఇంటికి విక్రమ్ ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? శ్రీరామ్, ఎమ్మెల్యే (శరత్ లోహితస్య) మధ్య గొడవ ఏమిటి? శ్రీరామ్ కోసం ఎమ్మెల్యే మనుషులు ఎందుకు వెతుకుతున్నారు? ఒక వైపు ఎమ్మెల్యే మనుషులు, మరోవైపు పోలీసులు... ఇద్దరి నుంచి శ్రీరామ్ ఎలా తప్పించుకున్నాడు? శ్రీరామ్ భార్య ఉత్తర (లయ), కుమారుడు మిట్టు (మాస్టర్ రోహన్) ఏం చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (Sampradayini Suppini Suddapoosani Review Telugu): క్రైమ్ కామెడీలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అయితే... హిట్ పెయిర్ శివాజీ - లయ, సినిమాను శివాజీ స్వయంగా నిర్మించడం వల్ల ప్రేక్షకుల్లో 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'పై అంచనాలు ఏర్పడ్డాయి. రీ ఎంట్రీలో కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న శివాజీకి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ లభించింది. కానీ, కథలో కొత్తదనం లేదు.

'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' దర్శకుడు సుధీర్ శ్రీరామ్ కొత్త కథతో కాకుండా హిట్ ఫార్ములాను నమ్ముకున్నారు. హీరో క్యారెక్టర్, క్రైమ్ విషయంలో 'దృశ్యం' ఛాయలు కనిపిస్తాయి. ఆ సినిమా సీరియస్‌గా సాగితే, ఈ సినిమాకు కామెడీ యాడ్ చేశారు. కుటుంబం కోసం మనసాక్షికి వ్యతిరేకంగా ముందడుగు వేసే హీరో రెండిటిలో కనిపిస్తాడు. సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే ప్రియమణి 'భామా కలాపం', 'మత్తు వదలరా' సినిమాలను సైతం గుర్తు చేస్తుంది. అయితే... ఈ సినిమాలో కామెడీతో పాటు థ్రిల్, ట్విస్ట్‌లు ఏదీ చూసినా ఆసక్తిగా ముందుకు సాగలేదు.

Also Read: Mrithyunjay Review - 'మృత్యుంజయ్' రివ్యూ: శ్రీవిష్ణు థ్రిల్లర్ ఎలా ఉంది? కామెడీ కాదు, కంటెంట్‌తో హిట్ కొట్టాడా?

భార్యాభర్తలుగా శివాజీ, లయ మధ్య కెమిస్ట్రీ బావుంది. కానీ, కామెడీయే లేదు. ఆ జంటకు సరిపడా సన్నివేశాలు రాయడంలో సుధీర్ శ్రీరామ్ ఫెయిలయ్యాడు. అలీ, కాదంబరి కిరణ్, 'జబర్దస్త్' / 'బిగ్ బాస్' ఇమ్మాన్యుయేల్ ఉన్నప్పటికీ... ఆ పాత్రలకూ సరైన డైలాగులు, పంచ్ లైన్స్ పడలేదు. అందువల్ల కొన్ని నవ్వులతో సరిపెట్టుకోవాలి. శివాజీ, లయతో పాటు రోహన్ సైతం నవ్వించడానికి... థ్రిల్ ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ... సన్నివేశాల్లో బలం లేదు. సంభాషణల్లో వినోదం పండలేదు. ధనరాజ్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్ ప్యాకేజ్ అనుకున్నట్టు ఉన్నారు. చివరిలో ఆయన ట్విస్ట్ కూడా పేలలేదు.

Also ReadSaraswathi Movie Review - ఎస్ సరస్వతి రివ్యూ: దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటి అడుగు - సినిమా హిట్టేనా?

క్రైమ్ విషయంలోనూ సీరియస్‌నెస్ కనిపించలేదు. ఎండింగ్ ట్విస్ట్ మరీ సిల్లీగా ఉంది. అందువల్ల, ఏ దశలోనూ సినిమా ఆసక్తిగా కలిగించదు క్లుప్తంగా చెప్పాల్సిన కథను సాగదీయడం వల్ల బోర్ కొడుతుంది. ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ప్రిన్స్ ట్రాక్ సినిమాకు మైనస్. ప్రిన్స్ సీన్స్ బాగా రాసుకుని ఉంటే క్రైమ్ తర్వాత టెన్షన్ బిల్డ్ అయ్యేది. కథకు కీలకమైన శివాజీ ఇంట్లో సీన్ సిల్లీగా ఉండటంతో కామెడీ & క్రైమ్ ఎఫెక్ట్ చూపించలేదు. మధ్యలో పాటలు ఇరికించకుండా మంచి పని చేశారు. బండ్ల గణేష్ 'పాయ...' క్లైమాక్స్ తర్వాత వస్తుంది. ఎండ్ క్రెడిట్స్ అన్నమాట. సినిమాటోగ్రఫీ ఓకే.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని... రొటీన్ క్రైమ్ కామెడీ సినిమా. కథ ఎంగేజ్ చేయదు. కామెడీ పూర్తిగా నవ్వించదు. శివాజీ, లయ కెమిస్ట్రీతో పాటు కొన్ని జోక్స్ బావున్నాయి. అయితే... సినిమాను గట్టెక్కించడానికి ఆ బలం సరిపోలేదు. స్టార్ట్ టు ఎండ్ ఎంజాయ్ చేయడం కష్టమే.

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
kalavari kodalu kanaka mahalakshmi serial today April 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి, యమునలకు షాక్! ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మీ!
Thaai Kizhavi OTT : 10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
10 కోట్ల బడ్జెట్‌తో 80 కోట్లు - టాప్ ట్రెండింగ్ మూవీ తప్పక చూడాల్సిందే... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పలేదా...
Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Embed widget