Priyamani : ద్రోణ సినిమా సాంగ్ - బికినీ ధరించడంపై ప్రియమణి క్లారిటీ
Priyamani Reaction : ద్రోణ సినిమాలో స్విమ్ సూట్ ధరించి సాంగ్ చేయడంపై హీరోయిన్ ప్రియమణి తాజాగా మళ్లీ రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు.

Priyamani Reaction On Wearing Swim Suit In Drona Movie : నితిన్ ద్రోణ సినిమాలో స్విమ్ సూట్ ధరించి సాంగ్ చేయడంపై ప్రియమణి తాజాగా రియాక్ట్ అయ్యారు. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్‌గా చేసిన సరస్వతి సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. తాజా ఇంటర్వ్యూలో స్విమ్ సూట్ సాంగ్‌పై ఆమె క్లారిటీ ఇచ్చారు.
అందుకే అలా చేశా
స్విమ్మింగ్ పూల్ దగ్గర శారీ వేసుకుని ఏదైనా సీన్ కానీ సాంగ్ కానీ షూట్ చేయలేమని చెప్పారు ప్రియమణి. 'ఆ టైంలో ఏ డ్రెస్ వేసుకోవాలో అదే వేసుకోవాలి. డైరెక్టర్ కూడా క్లియర్‌గా చెప్పారు. స్విమ్మింగ్ పూల్‌లో సాంగ్ కోసం స్విమ్ సూట్ వేసుకోవాలన్నారు. కరీనా కపూర్‌లా ఓ డిఫరెంట్ వేలో చూపిస్తామని చెప్పారు. దీంతో నేను ఓకే చెప్పాను. అప్పటివరకూ నేను స్విమ్ సూట్ వేయలేదు. ఆ తర్వాత దీనిపై చాలా కామెంట్స్, ట్రోలింగ్స్ సాగాయి.
ఓ నటిగా ఉన్నప్పుడు సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే అలాంటి డ్రెస్ వేసుకోక తప్పదు. మన కంఫర్టబుల్ మనం చూసుకోవాలి. ఆ టైంలో సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చింది. ఓసారి ట్రై చేస్తే తప్పేంటి? అనిపించింది. ఫారిన్ కంట్రీస్‌కు వెళ్తే స్విమ్మింగ్ పూల్ అంటే అందరూ స్విమ్మింగ్ సూటే వేసుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ ఇప్పుడు అడిగితే మాత్రం నేను చేయలేను అని కచ్చితంగా చెప్పేస్తాను.' అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
ట్రెండింగ్ వార్తలు
























