Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 బ్యాటర్లు, ముగ్గురు స్ట్రైక్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఇక ఈ కాంబినేషన్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav). ముందు కూడా ఇదే కొనసాగిస్తామని తెలిపాడు.
'ఈ మ్యాచ్‌లో మేం బ్యాటింగ్ చేసిన తీరు బాగుంది. పవర్ ప్లేలో 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడికి గురైన తర్వాత కూడా గేమ్ ను 15వ ఓవర్ వరకు నిలకడగా తీసుకెళ్లాం. ఆ తర్వాత మా బ్యాటర్లందరూ తమ జోరును ఏ మాత్రం తగ్గించలేదు.
8 మంది బ్యాటర్లు ముగ్గురు స్ట్రైక్ బౌలర్ల కాంబినేషన్ బాగుంది. ఒక టీమ్ గా మాకు ఈ స్ట్రాటజీ బాగా పనిచేస్తోంది. ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దీనినే కొనసాగిద్దాం. ఈ రోజు తీవ్ర ఒత్తిడిలో ఆడాల్సి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా సార్లు ఆడాను. నేను ముందుగా చెప్పినట్లుగా నెట్స్‌లో బాగా ఆడుతున్నాను. గత 2-3 వారాలుగా నా షాట్లను నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను. నెట్ సెషన్స్‌లో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇలానే ఆడాను. ఈ మ్యాచ్‌లోనూ అలానే ఆడటంతో సంతోషంగా ఉంది అంటూ తన పర్ఫార్మెన్స్ గురించి కూడా ప్రస్తావించాడు. అలాగే ఫీల్డింగ్ మెరుగవ్వాలని అన్నాడు. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతీసారి ఇంకా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం అని తెలిపాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.





















