India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 లో ( India vs New Zealand ) టీమ్ ఇండియా 48 పరుగుల తేడాతో గెలిచింది. రీసెంట్ గా వన్డే సిరీస్ ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 సిరీస్ ను మాత్రం సూపర్ విక్టరీతో మొదలు పెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సూపర్ అనిపించకున్నారు భారత్ టీమ్. వరుస ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఇది కివీస్ టీమ్ పై టీ20లలో భారత్ చేసిన అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.
రన్ ఛేజ్ కోసం మైదానంలోకి దిగిన కివీస్ రెండో బంతికే మొదటి వికెట్‌ను డెవాన్ కాన్వే ( Devon Conway ) రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్స్ వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. గ్లెన్ ఫిలిప్స్ ( Glenn Phillips ) 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి కొద్దీ సేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫిలిప్స్ వికెట్ తర్వాత న్యూజిలాండ్ ఓటమి దాదాపు ఖాయమైంది. ఆ తర్వాత టీమ్ మరిన్ని వికెట్లు కోల్పోయింది. చివరికి న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy ), శివమ్ దూబే ( Shivam Dubey ) అద్భుతంగా రాణించారు.





















